అదిగో పులి .. ఇదిగో పెళ్లి!

Last Updated on by

వెన‌క‌టికి ఒక‌డు అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నాడుట‌. బాలీవుడ్‌లో పెళ్లిళ్ల తంతు ఇలానే ఉంది. ఎప్పుడు ఏ జంట ఏ తీరుగా పెళ్లాడుకుంటుందో అస్స‌లు అర్థం కావడం లేదు. మొన్న‌టికి మొన్న ఇక సోన‌మ్‌- ఆనంద్ అహూజా పెళ్లికి భాజా మోగునులే అని ఠాంఠాం మోగింది. ఈ వేస‌వి కాలంలోనే వేడి వేడిగా మూడు ముళ్లు వేయించుకుంటుంద‌ట సోన‌మ్ అంటూ చెప్పుకున్నారు. ఇప్పుడు దీపిక వంతు. ఇప్ప‌టికే దీపిక ప‌దుకొన్‌- ర‌ణ‌వీర్ సింగ్ ఎక్క‌డ క‌నిపించినా జ‌నం అంతా `మొగుడు-పెళ్లాలు` అన్న‌ట్టే చూస్తున్నారు. ఆ జోడీ క‌లిసి న‌టించినా, క‌లిసి వేదిక‌ల్ని పంచుకున్నా అచ్చం ముచ్చ‌టైనా జంట‌లా ఉన్నారేంటో అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

దీపిక పెళ్లి గురించిన తాజా తాజా అప్‌డేట్ అందింది. అస‌లు ఇన్నాళ్లు దీపిక పెళ్లి ఎప్పుడు ఉంటుందో అంటూ సందేహించిన అభిమానుల‌కు ఇక ఎలాంటి డౌట్లు అఖ్క‌ర్లేదు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ముహూర్తం ఫిక్స్ చేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ముంబై, బెంగ‌ళూరులో ఇరు కుటుంబాలు క‌లుసుకుని షాపింగులు పూర్తి చేశారు. అలానే పెళ్లి వేడుక దుస్తుల డిజైనింగులు రెడీ అవుతున్నాయి. అయితే ఈ పెళ్లిని `విరుష్క` త‌ర‌హాలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ లా చేయాల‌న్న‌ది ఇరు కుటుంబాల ఆలోచ‌న అని తెలుస్తోంది. అందుకు అంత‌ర్జాతీయ స్థాయి వేదిక‌ను వెతికే ప‌నిలోనూ ఉన్నార‌ట‌. మీడియా హ‌డావుడి ఏమాత్రం లేకుండా, కేవ‌లం కొద్దిమంది బంధు మిత్రుల స‌మ‌క్షంలో వైభ‌వంగా పెళ్లి వేడుక సాగాల‌ని భావిస్తున్నార‌ట‌. మొత్తానికి ఆవిడ లేని నేను లేను! అని ర‌ణ‌వీరుడు తెగ ఇదైపోతున్నాడు. నా ప్రాణ‌స‌ఖుడు లేని నేను అస‌లే లేను! అంటూ దీపిక సాంగేసుకుంటోంది. ఇక ఈ కూనిరాగాల‌కు ఫుల్ స్టాప్ పెట్టి ఆ కార్య‌మేదో డిసెంబ‌ర్‌లోనే జ‌రిపించేందుకు ముహూర్తం ఫిక్స‌యింద‌న్న‌మాట!!

User Comments