కేన్స్‌లో బుట్ట‌బొమ్మ ఎవ‌ర‌మ్మ‌?

Last Updated on by

కేన్స్‌లో ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల హీట్ అంత‌కంత‌కు రాజ‌కుపోతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఓవైపు అంద‌గ‌త్తెల రెడ్ కార్పెట్ న‌డ‌క‌ల‌తో న‌గ‌రం హీటెక్కిపోయింది. ప‌లువురు బాలీవుడ్ క‌థానాయిక‌లు కేన్స్‌లో సంద‌డి చేస్తున్నారు. కంగ‌న ర‌నౌత్‌, దీపిక ప‌దుకొన్ వంటి మేటి నాయిక‌లు కేన్స్ ఉత్స‌వాల్లో మెరుపులు మెరిపిస్తున్నారు.

తాజాగా దీపిక ప‌దుకొన్ ధ‌రించిన ఓ గౌన్ కేన్స్‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఈ ప్ర‌త్యేక పింక్ గౌన్‌లో దీపిక‌ను వీక్షించిన వారంతా స్ట‌న్న‌యిపోయారంతే. స‌ముద్రంలో ఓ ప్ర‌త్యేక మ‌త్స్యాన్ని పోలి ఉన్న ఈ దుస్తుల డిజైన్ చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దీపిక స్ట‌న్నింగ్ రెడ్ గౌన్‌కి ఓ ఆస‌క్తిక‌ర పేరును చెబుతున్నారు. పింక్ జుహైల్‌ ముర‌ద్ గౌన్ అని చెబుతున్న ఈ డిజైన్‌ని ప్ర‌ఖ్యాత అంత‌ర్జాతీయ డిజైన‌ర్లు రూపొందించారు. దీపిక అంద‌చందాల వెన‌క సంధ్య శేఖ‌ర్ మేక‌ప్‌, గాబ్రియెల్ హెయిర్‌స్టైల్‌, ష‌లీనా న‌థానీ డిజైనింగ్ పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ అయ్యాయ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దీపిక న‌టించిన `ప‌ద్మావ‌త్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా 600 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే.

User Comments