Last Updated on by
బాలీవుడ్లో ఒకరితో ఒకరు పోటీపడుతూ ఎవరికి వారు అసాధారణ స్టార్డమ్ అందుకున్న మేటి నాయికలు ప్రియాంక చోప్రా, దీపికపదుకొన్. హాలీవుడ్‌లోనూ ఆ ఇద్దరూ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. కేవలం సినిమాలు, కెరీర్ పరంగానే కాదు.. వేదికలపైనా తళుకుబెళుకులు ఆవిష్కరించడంలోనూ ఆ ఇద్దరూ ఒకరికొకరు పోటీ. కేన్స్ వేదికలపై ఇదివరకూ ఆ ఇరువురు భామలు పోటీపడ్డారు. ముంబైలో పలు ఫ్యాషన్ ఈవెంట్లలోనూ, అవార్డు వేడుకల్లోనూ ఈ భామల మధ్య పోటీ ప్రధానంగా చర్చకొచ్చింది. ఆ ఇద్దరి మధ్యా క్యాట్ఫైట్లు పలు సందర్భాల్లో వెలుగు చూశాయి. బాలీవుడ్లో అగ్ర స్థానం కోసం కొట్లాటల్లోనూ వాడి వేడిగా ఈ రెండు పేర్లు తెరపైకొచ్చాయి.
తాజాగా వేరొక వేదికపైనా ఆ ఇద్దరి మధ్యా హోరాహోరీ షురూ అయ్యింది. మెట్ గాలా- 2018 పేరుతో న్యూయార్క్ నగరంలో జరగనున్న ఫ్యాషన్ వేడుకలో ప్రియాంక చోప్రా, దీపిక పదుకొన్ మధ్య వేడెక్కించే వాతావరణం నెలకొంది. ఆ ఇద్దరూ `ఫ్యాషన్ అండ్ ది కాథలిక్ ఇమాజినేషన్` పేరుతో సాగుతున్న ఈ కార్యక్రమంలో తమవైన తళుకుబెళుకులతో ర్యాంప్‌ని హుషారెత్తించబోతున్నారు. పాశ్చాత్య దేశాల్లో అక్కడివారి కట్టు బొట్టుకు తగ్గట్టే ఫ్యాషన్ కంటెంట్‌ని హై రేంజులో ఎలివేట్ చేసేందుకు ఈ భామలు రెడీ అవుతున్నారు. మెట్ గాలా ఈవెంట్లో ఈ ఇద్దరూ సంథింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుండడంపై ప్రస్తుతం బాలీవుడ్లో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. గత ఏడాది మెట్‌గాలా ఈవెంట్లో ఈ భామలిద్దరూ సందడి చేశారు. మరోసారి ఇదే వేదికపై ఆ ఇద్దరి మధ్యా వార్ భగ్గుమనే సన్నివేశం ఉంటుందా? అంటూ మాట్లాడుకుంటున్నారు. క్యాట్ ఫైట్లకు ఆస్కారం లేని వేదిక అయినా .. పోటీ మాత్రం ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.
User Comments