దీపిక త‌ప‌న‌లో అత‌డు

Last Updated on by

అందాల క‌థానాయిక దీపిక ప‌దుకొనే `ప‌ద్మావ‌త్`గా ప్రేక్ష‌కాభిమానుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 600కోట్ల వ‌సూళ్లు సాధించిన సినిమాలో నాయిక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. హాలీవుడ్‌లోనూ దీపిక‌కు అసాధార‌ణ ఫాలోయింగ్‌ని తెచ్చింది ఈ చిత్రం. ఇదివ‌ర‌కూ విన్ డీజెల్ వంటి టాప్ స్టార్ స‌ర‌స‌న ట్రిపుల్ ఎక్స్ 3 చిత్రంలో న‌టించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైనా, ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు డిజె కార్సో మాత్రం పార్ట్ 4ని తెర‌కెక్కించే స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు.

ట్రిపుల్ ఎక్స్‌4 చిత్రంలోనూ అందాల దీపిక పాత్ర‌ను కొనసాగిస్తున్నాన‌ని .. దీపిక కోస‌మే వేచి చూస్తున్నాన‌ని చిత్ర‌ద‌ర్శకుడు ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించాడు. ట్రిపుల్ ఎక్స్ 4 చిత్రాన్ని ఓ బాలీవుడ్ డ్యాన్స్ సాంగ్‌తో ముగిస్తాన‌ని అన్నాడు. “నిస్సంకోచంగా… అది దీపిక ప‌దుకొనే లుంగీ డ్యాన్స్‌తోనే ముగింపు ఉండొచ్చు..“ అంటూ హింటిచ్చాడు. అత‌డి ట్వీట్‌ని బ‌ట్టి దీపిక లేనిదే పార్ట్ 4 పూర్త‌వ్వ‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. దీపిక‌తో ఓసారి ప‌ని చేసిన ఏ ద‌ర్శకుడు అయినా త‌న‌తో మ‌రోసారి ప‌ని చేయాల‌ని అనుకోవ‌డం అంటే అది నిజంగానే ఈ అంద‌గ‌త్తెలో ఉన్న మ‌హ‌త్యం అనే చెప్పాలి. అయితే ప్ర‌స్తుతం పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. దీపిక ఈ చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రిస్తుందా? లేదా.. అన్న‌ది మాత్రం స‌స్పెన్స్‌.

User Comments