`దేవ్` మూవీ రివ్యూ

Last Updated on by

న‌టీన‌టులు: కార్తీ, ర‌కుల్ ప్రీత్, ప్ర‌కాష్ రాజ్, ర‌మ్య‌కృష్ణ‌ త‌దిత‌రులు

బ్యాన‌ర్‌: లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్- ప్రిన్స్ పిక్చ‌ర్స్- రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌: ఠాగూర్ మ‌ధు
సంగీతం: హ‌్యారిస్ జైరాజ్
కెమెరా: వేల్ రాజ్
ద‌ర్శ‌క‌త్వం: ర‌జ‌త్ ర‌విశంక‌ర్
రిలీజ్ తేదీ: 14-02-2019

ముందు మాట‌:
కార్తీ సినిమా అన‌గానే యుగానికి ఒక్క‌డు, ఆవారా, నా పేరు శివ వంటి క్లాసిక్స్ గుర్తుకొస్తాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించిన చిత్రాలు ఇవి. ఇటీవ‌లే కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో విసుగెత్తాడు. అటుపై చాలా గ్యాప్ త‌ర్వాత `ఖాకీ` చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. తెలుగులోనూ ఈ సినిమా డీసెంట్ క‌లెక్ష‌న్లు సాధించింది. అంత‌కుముందు `చిన‌బాబు` అనే చిత్రం ఫ‌ర్వాలేదు అన్న టాక్ తెచ్చుకుంది. అందుకే ఈసారి కార్తీ న‌టించిన `దేవ్` చిత్రానికి తెలుగులోనూ కొంత ఆస‌క్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టీజ‌ర్ చూశాక‌.. మ్యాట‌ర్ ఉంద‌ని యూత్ భావించారు. కార్తీ ఈసారి ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. ల‌వ్ స్టోరిలో అడ్వెంచ‌ర్.. థ్రిల్ మైమ‌రిపిస్తాయ‌ని టీజ‌ర్ చూశాక అంచ‌నా వేశారు. మొన్న రిలీజైన ట్రైల‌ర్ చూశాక సేమ్ ఫీల్ క‌లిగింది. ఒక గొప్ప ప్రేమ‌క‌థ‌తో తీసిన సినిమా ఇదీ అంటూ టీమ్ ప్ర‌చారం సాగించింది. అందుకు త‌గ్గ‌ట్టే ఫిబ్ర‌వ‌రి 14న‌ ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా సినిమా రిలీజైంది. అయితే టీజ‌ర్, ట్రైల‌ర్ లో ఉన్నంత కంటెంట్ సినిమాలో ఉందో లేదో తెలియాలంటే ఈ స‌మీక్ష చ‌ద‌వాల్సిందే.

క‌థ‌:

రెండు ఆపోజిట్ మ‌న‌స్త‌త్వాలు ఉన్న అమ్మాయి – అబ్బాయి ల‌వ్ లో ప‌డితే ఆ త‌ర్వాత పుట్టుకొచ్చే ఘ‌ర్ష‌ణ ఎలా ఉంటుంది? అన్న‌దే ఈ సినిమా థీమ్. ధ‌నార్జ‌న‌లో ఉండే అమ్మాయి మేఘ‌న (ర‌కుల్‌)తో డ‌బ్బు అంటే గిట్ట‌ని కుర్రాడి (కార్తీ) కి మ‌ధ్య ఎలాంటి క‌థ న‌డిచింది? ఆ ఇద్ద‌రి ల‌వ్ స్టోరిలో కార్తీ అడ్వెంచ‌ర్ క‌థేమిటి? ముంబై టు వైజాగ్ ల‌వ‌ర్స్ రోడ్ ట్రిప్ లో ఏం జ‌రిగింది? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.

ఇదో క్లీన్ ల‌వ్ స్టోరి. అడ్వెంచ‌ర్స్ ఇష్ట‌ప‌డే కుర్రాడి ల‌వ్ స్టోరి. అయితే దానిని తెర‌కెక్కించిన విధాన‌మే అత్యంత పేల‌వంగా ఉంద‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా స్లో నేరేష‌న్ అన్న‌ది సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది. ఎవ‌రెస్ట్ శిఖ‌రం ఎక్కే కుర్రాడిగా దేవ్ (కార్తీ) ఎంట్రీ ఉంటుంది. దేవ్‌ అడ్వెంచర్స్ అంటే బాగా ఇష్టపడే కుర్రాడిగా క‌నిపిస్తాడు. అలాగే మేఘన (ర‌కుల్) ఓ కార్పొరెట్ కంపెనీ ఉద్యోగిగా ప‌రిచ‌యం అవుతుంది. ల‌వ్ అనే పాయింట్ చుట్టూ క‌థ నెమ్మ‌దిగా సాగుతుంటుంది. మేఘ‌న కాంప్లికేటెడ్. దేవ్ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ని తిర‌స్క‌రిస్తుంది. ఆ త‌ర్వాత ఓ ఫైట్ సీన్ లో దేవ్ అడ్వెంచ‌ర్ చూసి ఫిదా అయిపోయి అటుపై త‌న‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డం .. ఆ క్ర‌మంలోనే ముంబై నుంచి వైజాగ్ కి మేఘ‌న‌ను రైడ్ కి ఒప్పించ‌డం .. ఇవ‌న్నీ సినిమాటిక్ గా సాగిపోతాయి. అయితే ప్ర‌తి ఫేజ్ లోనూ స్లో ఫేస్ మూవ్ మెంట్ ఉత్కంఠ‌కు బ్రేక్ వేస్తుంటుంది. మ‌ధ్య‌లో దేవ్ తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ రోల్, ర‌కుల్ త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ ఎంట్రీ డీసెంట్ గానే అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి హ్యారిస్ జైరాజ్ సంగీతం పెద్ద ప్ల‌స్. ఓ మై గర్ల్ సాంగ్ ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌థ‌మార్థంతో పోలిస్తే ద్వితీయార్థంలో గ్రిప్ పెర‌గాల్సింది. కానీ క‌థ గాడి త‌ప్ప‌డం.. ల‌వ్ చుట్టూనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డంతో అస‌లు సినిమాలో ఏం చూపించారు? అన్న క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంటుంది. ఓవ‌రాల్ గా ఈ సినిమా తెలుగులోనే కాదు అటు త‌మిళంలోనూ కార్తీ అభిమానుల్ని నిరాశ ప‌ర‌చ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

న‌టీన‌టులు:
కార్తీ ఎప్ప‌టిలానే డీసెంట్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ర‌కుల్ అంద‌చందాలు, ప‌రిణ‌తి చెందిన న‌ట‌న మైమ‌రిపించాయి. ప్ర‌కాష్ రాజ్, ర‌మ్య‌కృష్ణ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు మెప్పించారు.

ప్ల‌స్ పాయింట్స్:
* కార్తీ, ర‌కుల్ న‌ట‌న‌
*హ్యారిస్ జైరాజ్ రీరికార్డింగ్

మైనస్ పాయింట్స్
* క‌థ‌నం నెమ్మ‌దిగా సాగ‌డం ఇబ్బందిక‌రం
* ల‌వ్ చుట్టూ క‌థ తిరిగినా గ్రిప్ లేని సీన్లు

టెక్నీషియ‌న్స్
* హ్యారిస్ జైరాజ్ సంగీతం, రీరికార్డింగ్, వేల్ రాజ్ కెమెరా పెద్ద ప్ల‌స్. ఇత‌ర విభాగాలు సోసోగానే ప‌ని చేశాయి.

ముగింపు:
`దేవ్` ల‌వ్ ఎడ్వంచ‌ర్ బిలో యావ‌రేజ్.. కార్తీ అభిమానుల‌కు మాత్ర‌మే..

రేటింగ్‌:
2.0/5.0

User Comments