`దేవ్‌` మోస్ట్‌ ఛాలెంజింగ్ ల‌వ్ స్టోరి – కార్తీ

Last Updated on by

జ‌న‌రేష‌న్ గ్యాప్ తో ప్రేమ‌క‌థ‌లు మారుతుంటాయి. `దేవ్` మోస్ట్‌ ఛాలెంజింగ్ ల‌వ్ స్టోరీని తెర‌పై చూడండి అన్నారు కార్తీ. హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌రిగిన `దేవ్‌` ప్రీరిలీజ్ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. ఈ వేడుక‌లో ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్, నిర్మాత ఠాగూర్ మ‌ధు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్తీ మాట్లాడుతూ-“అమ్మాయిని క‌ల‌వ‌డం అంటే కాలేజ్ , బ‌స్టాప్ లో క‌ల‌వ‌డం కాదు.. అంత‌ర్జాలంలో ఎక్క‌డ ఉన్న అమ్మాయితో అయినా మాట్లాడ‌వ‌చ్చు. జ‌న‌రేష‌న్ గ్యాప్ తో ఎంతో మారింది లైఫ్‌. ఐదేళ్ల‌కు ఓసారి త‌ర‌చి చూసుకుంటే ఇది అర్థ‌మ‌వుతుంది. థాట్ ప్రాసెస్ మారుతుంది. ల‌వ్ .. అమ్మా నాన్న ల‌తో రిలేషన్.. ప్ర‌తిదీ మారిపోతాయి. అమ్మాయిని క‌ల‌వ‌డం అంటే ఇంట‌ర్నెట్ ద్వారా న్యూయార్క్ లో అమ్మాయిని క‌ల‌వొచ్చు. ఇది అడ్వెంచ‌ర్ క‌దా! అలాంటివి యంగ్ స్ట‌ర్ కి క‌నెక్ట‌వుతాయి. ఈ జ‌న‌రేష‌న్ ల‌వ్ స్టోరి అని చెప్పొచ్చు. బ్రోకెన్ మ్యారేజెస్ కామ‌న్. బ్రేక‌ప్ చాలా ఈజీ అయిపోయింది. సినిమాని మోస్ట్ స్టైలిష్డ్ గా తెర‌కెక్కించాం. క‌థ విన‌గానే బీఎండ‌బ్ల్యూ బైక్ బుక్ చేశాం. కార్స్ , రోల్స్ రాయిస్ .. అన్నీ బుక్ చేశాం. న్యూయార్క్ నుంచి వ‌చ్చిన అమ్మాయి కూడా ఉంది“ అని అన్నారు.

“ఖాకీ షూటింగ్ చేసేప్పుడు .. ర‌కుల్ ని చూశాను. అప్పుడు త‌ను బిజినెస్ ఉమెన్ పాత్రకు స‌రిపోతుంది అనుకున్నా. ఒక అమ్మాయిని చూస్తే నా పాత్ర భ‌య‌ప‌డాలి. అప్పుడు ర‌కుల్ ని ఎంపిక చేసుకున్నాం. నాకు డ‌బ్బు అంటే అంత ఇంపార్టెంట్ కాదు..ర‌కుల్ కి డ‌బ్బు అంటే ఇంపార్టెంట్ .. ఇలాంటి క్యారెక్ట‌ర్లు ప్రేమించుకుంటే ఏంటి? అన్న‌దే సినిమా.
త‌న పాత్ర మేఘ‌న బిజినెస్ మైండెడ్.. ఒక్కో పాట ఒక్కో క‌థ‌లా నెరేష‌న్ లా వ‌స్తాయి.. రిలేషన్ షిప్ పై సినిమా ఇది..
హ్యారిస్ జైరాజ్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు“ అని తెలిపారు. ఖాకీ, చిన‌బాబు త‌ర్వాత ప్ర‌యోగాత్మక చిత్ర‌మిది.. అని తెలిపారు. కార్య‌క్ర‌మంలో చిత్ర‌యూనిట్ పాల్గొంది. ఈనెల 14న ప్రేమికుల రోజు కానుక‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

User Comments