బ‌య‌ట‌పడిన దేవ్ ర‌హ‌స్య

Last Updated on by

దేవ్ ర‌హ‌స్య ం ఏంటి? ఆ టైటిల్ ఎంపిక వెన‌క సస్పెన్స్ ఏమై ఉంటుంది? ఇదే ప్ర‌శ్న హీరో కార్తీని అడిగితే ఆయ‌న గ‌మ్మ‌త్త‌యిన జ‌వాబే ఇచ్చారు. దేవ్ టైటిల్ వెన‌క ర‌హస్యాన్ని ద‌ర్శ‌కుడినే అడ‌గాలి. ఆయ‌న క‌పిల్ దేవ్ అభిమాని. క‌పిల్ దేవ్ లోంచి దేవ్ ని ఎంచుకున్నారు. ఆ టైటిల్ ఈ క‌థ‌కు స‌రిపోతుంద‌ని అనిపించింది.. అని అన్నారు కార్తీ. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం దేవ్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 న ఈ సినిమా విడుదలవుతోంది. రజత్‌ రవిశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వ ం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది.

హీరో కార్తీ మాట్లాడుతూ.. ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ పై సినిమా ఇది. చాల అందమైన కథ తో తెర‌కెక్కింది. యూత్‌ ఈ సినిమా కి కనెక్ట‌వుతారు.. లవ్ , స్నేహం చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది.. ఈ సినిమాలోని మేఘన పాత్రకు రకుల్ స‌రిగ్గా స‌రిపోయింది రెండు వేరు వేరు ఆలోచనలున్న వ్యక్తుల లవ్ ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురయ్యయనేదే సినిమా కథ.. హారిస్ జయరాజ్ మంచి సంగీతం ఇచ్చారు.. ముఖ్యంగా ఎస్పీబీ గారు పాడిన పాత సినిమా కే హైలైట్. రకుల్ నా కాంబినేషన్ మళ్ళీ ప్రేక్షకులను అలరిస్తుంది.. రజత్ ఈ సినిమా కి ప్రాణం పెట్టాడు. చాల కష్టపడ్డాడు.. ఈ సినిమాలో నటించిన అందరు చాల బాగా నటించారు.. డిఫరెంట్ కథ చేసిన ఫీలింగ్ ఉంది నాకు… కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది.. మళ్ళీ సక్సెస్ మీట్ లో మీ అందరిని కలుస్తాను అన్నారు..
దర్శకుడు రజత్ రవిశంకర్ మాట్లాడుతూ.. దేవ్ సినిమా లో హీరో క్యారక్టర్ అందరికి పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది.. ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్ గారికి , తెలుగులో రిలీజ్ చేస్తున్న ధన్యవాదాలు.. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి..అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ , యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి..ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన నా టీం కి కృతజ్ఞతలు అన్నారు..

నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ.. కార్తీ తో చాలా రోజుల నుంచి అనుబంధం ఉంది. అలాంటి హీరో తో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా కి పనిచేసిన అందరికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి చాలా మంది పనిచేశారు. రకుల్ చక్కని అభినయం కనపరిచింది. దర్శకుడు రజత్ స్క్రిప్ట్ లో ఎం చెప్పాడో స్క్రీన్ లో అదే చూపించాడు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అయన. మ్యూజిక్ చాల బాగుంది. హారిస్ జయరాజ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు అన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..ఈ సినిమా పై ప్రతి సారి మీ స్ప ంద‌న‌ చూస్తే చాల సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు మేఘన. చాల పవర్ ఫుల్ రోల్.. ఇండిపెండెంట్ వుమన్ పాత్ర అది.మీ అందరికి నా పాత్ర నచ్చుతుంది. ముందుగా అవ‌కాశ‌మిచ్చిన వారికి ధ‌న్య‌వాదార‌లు. ఖాకీ టైం లోనే కార్తీ తో మంచి అనుబంధం ఏర్పడింది. మళ్ళీ ఈ సినిమా కూడా ఖాకీ లాగే మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. డైరెక్టర్ రజత్ మంచి ప్ర‌తిభావంతుడు. కొత్త డైరెక్టర్ లా అనిపించలేదు. అన్ని ఎమోషన్స్ ని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఆయనకు మరిన్ని పెద్ద పెద్ద సినిమాలు రావాలి. నిర్మాత‌ల సాయం మ‌ర‌వ‌లేను. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది అన్నారు..

User Comments