`దేవ‌దాస్‌` వెంట‌నే `జెర్సీ`?

Last Updated on by

నేచుర‌ల్ స్టార్ నాని – కింగ్ నాగార్జున కాంబినేష‌న్ మూవీ `దేవ‌దాస్‌` ఈ గురువారం(సెప్టెంబ‌ర్ 27) రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత వెంట‌నే నాని వేరే సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నున్నారు. నాని న‌టించే `జెర్సీ` చిత్రాన్ని విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్‌లో ప్రారంభం కానుంది. ఆ మేర‌కు హైద‌రాబాద్ అన్న‌పూర్ణ 7 ఏక‌ర్స్‌లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో నాని డీటెయిల్స్ అందించారు.

దేవ‌దాస్ గురించి మాట్లాడుతూ అశ్వ‌నిద‌త్ బ్యానర్ వైజ‌యంతి అంటే త‌న‌కు సొంత బ్యాన‌ర్‌తో స‌మాన‌మ‌ని అన్నారు. త‌న‌ని ద‌త్ సొంత మ‌నిషిలా చూసుకుంటార‌ని తెలిపారు. తాను అసాధార‌ణ స్టార్‌డ‌మ్ ఉన్న హీరోని కాద‌ని, త‌న‌ని చూసి థియేట‌ర్ల‌లో ఆడియెన్ విజిల్స్ వేస్తార‌ని అనుకోనని నాని అన్నారు. సినిమాని న‌మ్మి జ‌నం చూస్తారు. నాగార్జున గారు మా సినిమాకి పెద్ద అస్సెట్ అని నాని తెలిపారు. ఇమేజ్ డ్రివెన్ ఆర్టిస్టును కాను. ఏదో క‌టౌట్ చూసి నా సినిమాల‌కు రారు. ఉద‌యాన్నే విజిల్స్ ని ఆస్వాధించాల‌ని కూడా ఎవ‌రూ అనుకోరు అంటూ వ్యాఖ్యానించారు నాని. `జెర్సీ` గురించి చెబుతూ.. ద‌స‌రాకి చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది. కెరీర్‌లో బాగా కుదిరిన చిత్ర‌మవుతుంది. దీనికోసం రోజూ మూడున్న‌ర గంట‌ల పాటు క్రికెట్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నా. సినిమాలో బ్యాట్స్ మ‌న్‌గా క‌నిపిస్తాన‌ని వెల్ల‌డించారు.

User Comments