దేవ‌ర‌కొండ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌..చూశారు!

Last Updated on by

న‌వ‌త‌రం హీరోల్లో విల‌క్ష‌ణ‌త‌, వైవిధ్య ం ఉన్న క‌థానాయ‌కుడిగా త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్‌రెడ్డి సినిమాతో అత‌డి స్టార్‌డ‌మ్ ఆకాశాన్ని తాకింది. న‌టించిన రెండో సినిమాతోనే 40 కోట్ల క్ల‌బ్ హీరోగా ఎదిగేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు షాక్‌నిచ్చింది. ఆ క్ర‌మంలోనే విజ‌య్ గ్రాఫ్ ఏకంగా స్కైని ట‌చ్ చేసింది. ఇప్ప‌టికిప్పుడు వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయిపోయాడు. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీస్ వంటి అగ్ర బ్యాన‌ర్ల సినిమాల్లో దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడు. అత‌డు న‌టిస్తున్న‌ ట్యాక్సీవాలా, కామ్రేడ్ చిత్రాల ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశారు.

అదంతా అటుంచితే దేవ‌ర‌కొండ కీల‌క‌పాత్ర పోషించిన `మ‌హాన‌టి` నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణి అలియాస్ స‌మంత‌ను ప్రేమించే ఆంథోని అలియాస్ దేవ‌ర‌కొండ అద్భుత‌మైన పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. అయితే మ‌హాన‌టి రిలీజ్ సంద‌ర్భ ంగా నేడు విజ‌య్ దేవ‌ర‌కొండ డిఫ‌రెంటుగా సినిమాని ప్ర‌మోట్ చేశాడు. హైద‌రాబాద్ వీధుల్లో, థియేట‌ర్ల ముందు జ‌నం గుమిగూడి ఉన్న చోటికి స్వ‌యంగా ఓ ఐస్‌క్రీమ్ వ్యాన్‌ని తీసుకెళ్లి అంద‌రికీ ఐస్‌క్రీమ్‌లు పంచాడు. దేవ‌ర‌కొండ మొబైల్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ అంద‌రికీ పిచ్చిగా న‌చ్చేసింది. ఇక ఐస్‌క్రీమ్‌లు అందుకునే కంగారుతో పాటు దేవ‌ర‌కొండ‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీప‌డ్డారు. ఇక ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ వ‌ద్ద ప్రివ్యూ షో వేళ దేవ‌ర‌కొండ ఐస్‌క్రీమ్ బండిని ముంచేస్తూ మీడియా చేసిన హంగామా మామూలుగా లేదు. మొత్తానికి ఐస్‌క్రీమ్‌లు పంచుతూ దేవ‌ర‌కొండ మ‌హాన‌టికి గొప్ప ప్ర‌చార‌మే చేశాడు. ఫ్యాన్స్‌ని గ్రాబ్ చేయ‌డానికి గొప్ప ఎత్తుగ‌డే వేశాడు ఎండ‌ల్లో!

User Comments