పూరికి దేవ‌ర‌కొండ ఛాన్సిస్తాడా?

స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గ‌త వైభ‌వం గురించి, నేటి ప‌రాభ‌వం గురించి తెలిసిందే. పూరి స్ట్రైక్ అయితే క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారాల్సిందే. కానీ ఎందుక‌నో ఈ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ఊహించ‌ని స్లంపులో ప‌డిపోయాడు. ఆ క్ర‌మంలోనే గాడి త‌ప్పిన కెరీర్‌ని తిరిగి దారికి తెచ్చేందుకు చేయ‌ని ప్ర‌య‌త్న‌మే లేదు.

ప్ర‌స్తుతం పూరి ఆకాష్ పూరి, రామ్ లాంటి హీరోల్ని న‌మ్మాడు. ఆ ఇద్ద‌రితో సినిమాలు చేసి హిట్లు కొట్టి తిరిగి ట్రాక్‌లోకి రావాలన్న‌ది ఆలోచ‌న‌. ఎయిమ్ ఫ‌ర్ లెవంథ్ మైల్ అన్నంత క‌సిగా ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం కొడుకు ఆకాష్ న‌టించే సినిమాని లాంచ్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. అయితే ఈ సినిమాకి కేవ‌లం నిర్మాత మాత్ర‌మే. త‌దుప‌రి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్ప‌టికే క‌థ ఓకే అయ్యింద‌ని తెలిసింది. ఇక‌పోతే ఈ ప్రాజెక్టు గురించి చ‌ర్చిస్తుండ‌గానే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనూ పూరి సినిమా చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ట‌. దేవ‌ర‌కొండ లాంటి హీరో నెక్ట్స్ లెవ‌ల్ చూడాలంటే పూరి లాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌తోనే సినిమా చేయాల్సి ఉంటుంది. అయితే పూరి ట్రాక్ రికార్డు దృష్ట్యా.. దేవ‌ర‌కొండ లైన‌ప్ దృష్ట్యా అది సాధ్య‌మ‌వుతుందా? అన్న‌ది వేచి చూడాలి. మ‌రోవైపు దేవ‌ర‌కొండ కోసం క‌థ‌లు ప‌ట్టుకుని గోపిచంద్ మాలినేని, మారుతి లాంటి ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నార‌ట‌. మ‌రి పూరీకి విజ‌య్ దేవ‌ర‌కొండ ఛాన్సిస్తాడా.. లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.