దేవ‌ర‌కొండ‌కే షాకిచ్చిన బుడ‌త‌డు!

Last Updated on by

`అర్జున్‌రెడ్డి` సినిమాతో దేవ‌ర‌కొండ మానియా ఏ రేంజులో ఊపేసిందో తెలిసిందే. గీత‌గోవిందం, ట్యాక్సీవాలాతో కెరీర్ పీక్స్ కి చేరింది. దానికి తోడు రౌడీ అంటూ విజ‌య్ మొద‌లుపెట్టిన బ్రాండ్ యువ‌త‌లో రోజు రోజుకీ చొచ్చుకుపోతోంది. దీంతో విజ‌య్‌కి సంబంధించిన ప్ర‌తీ ఫొటోను, వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షేర్ చేయ‌డం.. దాని ద్వారా విజ‌య్ ట్వీట్ రూపంలో వారిని అభినందించ‌డం నిత్య కృత్యంగా మారింది. తాజాగా స‌తీష్ అనే ఓ అభిమాని చేసిన ప‌నికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫిదా అయిపోయాడు.

విజ‌య్‌కి ఓ చిన్ని పిల్ల‌వాడు షావుకారు జాన‌కితో మాట్లాడుతున్న వీడియోను ట్యాగ్ చేసి `ఇత‌ని విజ‌య్ దేవ‌ర‌కొండేనా? నాకు క్లారిటీగా తెలియ‌దు` అంటూ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో క‌నిపిస్తున్న చిన్న బుడ‌త‌డు `చ‌దువు మానేసి పుట్ట‌ప‌ర్తికి వ‌చ్చిన స్వామివారు.. ఇక్క‌డ ఏం చేశారు టీచ‌ర్‌` అంటూ అడ‌గ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కీ ఆ వీడియోలో వున్న బుడ‌త‌డు మ‌రెవ‌రో కాదండోయ్ టాలీవుడ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ వీడియోని చూసిన విజ‌య్ ఫిదా అయిపోయాడు. `నా చిన్న‌నాటి విష‌యాలు సోష‌ల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతున్న‌ట్టున్నాయ్‌. ఈ వీడియోను ఎవ‌రు పోస్ట్ చేశారో వాళ్లు న‌న్ను మా అమ్మ‌ను మాతో పాటు నా అభిమానుల‌ను కూడా సంతోష‌ప‌రిచారు. ఆ గొంతు నాదే అయితే ఎంత బాగుండో మ‌ళ్లీ ఒక్కసారి నా చిన్న‌నాటి గొంతును వినే అవ‌కాశం చిక్కేది` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ‌య్ స్పందించ‌డం ఆక‌ట్టుకుంటోంది.

User Comments