బాటిల్‌.. గ‌న్‌.. దేవ్ దాస్

Last Updated on by

దేవ్ చేతిలో బాటిల్‌.. గ‌న్‌.. దాస్ మెడ‌లో స్నెత‌స్కోప్ .. ఆద‌మ‌రిచి హాయిగా నిదురిస్తున్నారు. ఇంత‌కీ మోడ్ర‌న్ దేవ‌దాస్ క‌థేంటో? దేవ్ క‌థేంటో.. దాస్ క‌థేంటో.. తేలాల్సి ఉంది. నాగార్జున‌, నాని హీరోలుగా న‌టిస్తోన్న దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ సంథింగ్ స‌ర్‌ప్రైజ్. ఇటు కింగ్ అభిమానుల‌కు, అటు నేచుర‌ల్ స్టార్ అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ అనే చెప్పాలి.

Deva Das First Look Poster

2018 క్రేజీ మ‌ల్టీస్టార‌ర్స్‌లో దేవ‌దాస్ ముందు వ‌రుస‌లో ఉంద‌ని ఈ లుక్ ప్రూవ్ చేసింది. దేవ‌దాసు ఫ‌స్ట్ లుక్ లో టైటిల్ తో పాటు నాగార్జున, నాని పాత్ర‌ల గురించి ఇప్ప‌టికే ప‌రిచ‌యం చేసారు. ఎవ‌రు దేవ్.. ఎవ‌రు దాసుగా న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని ఫ‌స్ట్ లుక్ లోనే తెలియ‌చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంలో నాగార్జున‌కు జోడీగా ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ర‌ష్మిక మంద‌న‌ న‌టిస్తున్నారు. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. సెప్టెంబ‌ర్ 27న సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు. వై జ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వినీదత్ నిర్మాత‌గా.. సి ధ‌ర్మ‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. న‌రేష్ వికే, బాహుబ‌లి ప్రభాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య త‌దిత‌రులు న‌టిస్తున్నారు. స‌్యామ్ ద‌త్ సైనూదీన్ కెమెరా వ‌ర్క్ అందిస్తుండ‌గా, మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

User Comments