దేవ‌ర‌కొండ డేరింగ్ యాక్ట్‌

Last Updated on by

న‌వ‌త‌రంలో డేరున్న కుర్ర‌హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. నైజాంలో నితిన్ కెరీర్ ట్రామాలో ఉన్న వేళ ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్‌గా దేవ‌ర‌కొండ మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు. ఎవ్వెరి డాగ్ హాజ్ ఏ డే! అన్న చందంగా దేవ‌ర‌కొండ టైమ్ న‌డుస్తోందిప్పుడు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, మ‌హాన‌టి .. ఎదురే లేని లైన‌ప్ ఇది. అన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లే. అత‌డు లెగ్గు పెడితే గోల్డెన్ లెగ్గు పెట్టిన‌ట్టేన‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇక ఇదే హుషారులో దేవ‌ర‌కొండ వ‌రుస‌గా ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తున్నాడు. అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌న్నీ స‌క్సెస్‌ఫుల్ హీరో చుట్టూ కంచె వేశాయి. కాపు కాసాయి. భారీ అడ్వాన్సులు చెల్లించి వ‌రుస‌గా క‌మిట్‌మెంట్లు కుదుర్చుకున్నాయి.

ఇక‌పోతే విజ‌య్ దేవ‌ర‌కొండ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఫీట్స్ గురించి చెప్పాలంటే మాట‌లు చాల‌నే చాల‌వు. అత‌డు సామాజిక స్పృహ విష‌యంలోనూ అంతే వేగం చూపిస్తున్నాడు. ఇదివ‌ర‌కూ మ‌హాన‌టి రిలీజ్ వేళ ఉచిత‌ ఐస్‌క్రీమ్ బండితో ఐమ్యాక్స్‌కి విచ్చేసిన దేవ‌ర‌కొండ కొత్త‌గా క‌నిపించాడు జ‌నాల‌కు. ఇప్పుడు త‌న‌కు వ‌చ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలానికి పెట్టి మ‌రోసారి ధీర‌త్వం ప్ర‌దర్శించి ఇంకా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. వేలంలో ద‌క్కిన 25ల‌క్ష‌ల సొమ్ముల్ని తృణ‌ప్రాయంగా టీ- ప్ర‌భుత్వ ఖ‌జానాకు జ‌మ చేసేసి మ‌రోసారి షాక్‌నిచ్చాడు. నిన్న‌టిరోజున ఐటీ మంత్రి కేటీఆర్‌ని క‌లిసి దేవ‌ర‌కొండ ఫ్యామిలీ ఈ చెక్‌ని అందించింది. ఇలాంటి రేర్ ఫీట్ చూశాక కూడా దేవ‌ర‌కొండా శ‌భాష్ అని పొగిడేయ‌కుండా ఉండ‌గ‌ల‌రా ఎవ‌రైనా?

User Comments