`మ‌హాన‌టి`పై అభాండాలు!

Last Updated on by

తాగుబోతు.. తిరుగుబోతు అని తిట్టేయ‌డం జ‌నాల‌కు ఉన్న దుర‌ల‌వాటు! తాగి తంద‌నాలాడే వాళ్ల‌ను చూసి బుద్ధిమంతులైన ఈ మంది జ‌నం తామెంతో గొప్ప అని ఫీల‌వుతుంటారు. స‌నాత‌న భార‌తీయ సాంప్ర‌దాయంలో తాగేవాళ్లు, తిరిగేవాళ్లు అంద‌రికీ లోకువే. సాంప్ర‌దాయ వాదులు, సాంస్కృతిక వాదులు ఇలాంటివారిని దారిత‌ప్పిన వాళ్లు అని తిట్టేస్తుంటారు. ఇలాంటోళ్లు మ‌నలోనూ ఎక్కువే! అలా కాక‌పోతే `సావిత్రి ప‌చ్చి తాగుబోతు! తాగుడు వ‌ల్ల‌నే చ‌నిపోయింది` అనే సంస్కారం ఎలా వ‌చ్చింది? భ‌ర్త విడిచిన న‌టి అన్న బ్యాడ్‌నేమ్‌ని ఎందుకు ఆపాదించారు? చివ‌రి రోజుల్లో ఎంతో హీనంగా గ‌డిపింది. క‌ష్టాల్లో జ‌బ్బు చేసి మ‌ర‌ణించింది! అంటూ తూట్లు పొడుస్తూ, విహీనంగా `రుగ్మ‌త‌`తో కూడిన భావ‌జాలంతో నానా ర‌కాలుగానూ మాట్లాడుకున్నారు ఈ మంది జ‌నం.

అలాంటి కుహానా బ్యాచ్‌ని ఏకిప‌డేశాడు యువ‌హీరో, `అర్జున్ రెడ్డి` ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ. సావిత్రిని తాగుబోతు అని, భ‌ర్త విడిచిపెట్టిన మ‌హిళ అని గేలి చేసిన‌ మ‌హాశ‌యులంతా ఇటు రండి. సారీ చెప్పాల‌నుకుంటే చెన్న‌య్ లీలా ప్యాలెస్‌లో ఉన్నాను.. వ‌చ్చి క‌ల‌వండి“ అంటూ తిట్టేశాడు. అలా చేస్తే మ‌హాన‌టి ఆడియో టిక్కెట్లు ఇస్తానని బిస్కెట్ వేశాడు. మీరు వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెబితేనే సావిత్రి ఆత్మ శాంతిస్తుంద‌ని అన్నాడు. అసలు మంచి మ‌మ‌త‌, ప్రేమాభిమానాలు, ఆత్మాభిమానం ఉన్న సావిత్రిని అలా అనేందుకు మీకు మ‌న‌సెలా వ‌చ్చింది అనే అర్థంలోనూ చీవాట్లు పెట్టాడు దేవ‌ర‌కొండ‌. గొప్ప ప్రేమ‌గుణం, ఆప‌న్నుల‌ను ఆదుకునే త‌త్వం సావిత్రికే ఉంది. ప్రేమించ‌డం.. ప్రేమించ‌బ‌డ‌డం.. సూప‌ర్‌స్టార్ కంటే గొప్ప‌వని భావించిన మేటి నాయిక‌. అస‌లు భ‌యం అన్న‌దే లేని న‌టి… అని సుదీర్ఘంగా క్లాస్ తీస్కున్నాడు. మే 9న మ‌హాన‌టి రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments