దేవీ శ్రీ బ్ర‌ద‌ర్ న్యూ జ‌ర్నీ

సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీప్ర‌సాద్ బ్ర‌ద‌ర్ సాగ‌ర్ కొత్త ప్ర‌యాణం మొద‌లు పెడుతున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ గాయ‌కుడిగా మెప్పించిన సాగ‌ర్ మాట‌ల ర‌చయిత‌గాను మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు. బెలల్ల‌కొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `రాక్ష‌సుడు` సినిమాకు మాట‌లు అందిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా దేవి శ్రీ సంతోషం వ్య‌క్తం చేసాడు. నాన్న‌గారి వార‌స‌త్వాన్ని సాగ‌ర్ కొన‌సాగిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. అందుకు ప్రేక్ష‌కుల‌కు సాగ‌ర్ ఆశీర్దించాల‌ని కోరాడు. డీఎస్పీ సంగీత ద‌ర్శ‌కుడిగా, గీత ర‌చ‌యిత‌గా, స్టేజ్ పెర్పామ‌ర్ గా రాణిస్తోన్న నేప‌థ్యంలో సాగ‌ర్ కూడా కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌డం ప‌ట్ల ప్రేక్ష‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

సాగ‌ర్ సింగ‌ర్ గా కొన‌సాగుతూనే డైలాగ్ రైట‌ర్ గా అవ‌కాశాలు వ‌చ్చిన సినిమాల‌కు ప‌నిచేస్తాడ‌ని తెలుస్తోంది. అన్న‌య్య స‌హ‌కారం ఉంటుది కాబ‌ట్టి అవ‌కాశాలకు ఢోకా ఉండ‌దు. మ‌రి రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం లో సాగ‌ర్ ఎంత వ‌ర‌కూ స‌క్సెస్ అవుతాడో చూడాలి. త‌మిళ్ లో ఈ సినిమా రాట్స‌స‌న్ గా విడుద‌ల కానుంది. ఇటీవ‌లే ఈ సినిమా టీజ‌ర్ రెండు భాష‌ల్లోనూ రిలీజ్ అయింది. బెల్ల‌కొండ ఆశ‌ల‌న్నీ కూడా ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన `సీత `కూడా ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌ని సంగ‌తి తెలిసిందే.