దేవీ శ్రీ ప్ర‌సాద్ ప్రామిస్ చేసాడు

Last Updated on by

డిఎస్పీ.. ఈ పేరుకు ఓ బ్రాండ్ ఉంది. ఈయ‌న సంగీతానికి ఓ స్టాండ‌ర్డ్ ఉంది. ఎలాంటి సినిమా అయినా కూడా దేవీ సంగీతం అందిస్తున్నాడంటే దాని రేంజ్ మారాల్సిందే. అలా ఉంటాయి ఈయ‌న పాట‌లు. సినిమాను కేవ‌లం త‌న మ్యూజిక్ తో నిల‌బెట్ట‌గ‌ల అతికొద్ది మంది సంగీత ద‌ర్శ‌కుల్లో డిఎస్పీ తొలి వ‌ర‌స‌లో ఉంటాడు. ఈ త‌రంలో ఏ సంగీత ద‌ర్శ‌కుడికి సాధ్యం కాని చాలా రికార్డుల‌ను అందుకున్నాడు దేవీ. ఇక ప్ర‌తీ ఏడాది మాదిరే ఈ సారి కూడా యుఎస్ టూర్ వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌లైంది.

ఇందులో సుకుమార్ న‌టించ‌డం మ‌రో విశేషం. స్నేహితుడి కోసం.. అత‌డికి ఇచ్చిన మాట కోసం రంగ‌స్థ‌లంలో జిగేల్ రాణి త‌ర‌హాలో ఇక్క‌డ కూడా దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇంట్రో ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను టైటిల్ సాంగ్ ను త‌న టూర్ కోసం వాడేసుకున్నాడు దేవీ శ్రీ ప్ర‌సాద్. ఈయ‌న‌తో పాటు హేమ‌చంద్ర‌, శ్రావ‌ణ‌భార్గ‌వి, సాగ‌ర్, రైనా, శ్ర‌ద్ధాదాస్ కూడా ఈ టూర్ లో దేవీతో పాటు అమెరికా వెళ్తున్నారు. మొత్తానికి డిఎస్పీ ప్రామిస్ చేస్తున్నాడు అందరిని ఎంటర్ టైన్ చేస్తానని.

User Comments