స‌రిలేరుకి డిఎస్పీ రిపేర్లు?

Sarileru Nekevvaru - File Photo

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స‌రిలేరు నీకెవ్వ‌రు కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే దేవి శ్రీ అందించిన ట్యూన్స్ విష‌యంలో అనీల్ అసంతృప్తిగా ఉన్న‌ట్లు ఇటీవ‌లే క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇప్ప‌టికే విడుద‌లైన‌ టైటిల్ ట్రాక్ అంత‌గా ఆక‌ట్టుకులేదు. మ‌హేష్ అభిమానులు సైతం పెద‌వి విరిచేసారు. దీంతో అనీల్ ఒత్తిడి మ‌రింత ఎక్కువైంద‌ని ప్రచారం సాగింది. తాజాగా మ‌హేష్ బాబు రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

నేరుగా మ‌హేష్ ట్యూన్స మార్చ‌మ‌ని దేవిని కోరాడుట‌. అందుకు దేవి కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే రెడీ చేసి పెట్టిన ట్యూన్స్ బ‌ధులుగా ఫ్రెష్ ట్యూన్స్ కంపోజ్ చేసే ప‌నిలో ప‌డ‌ట్లు టాక్. త‌మ్ముడు, సింగ‌ర్ సాగ‌ర్ తో క‌లిసి దేవి ట్యూన్స్ కంపోజ్ చేసే ప‌నిలో ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌హేష్ సినిమాల నుంచి ఇలాంటి స‌న్నివేశం దేవి శ్రీకి ఎప్పుడు ఎదుర‌వ్వ‌లేదు. ఓవ‌రాల్ గా పాట‌ల‌న్నీ రోటీన్ గా ఉంటున్నాయ‌ని విమ‌ర్శ త‌ప్ప‌! ఇలాంటి సంద‌ర్భం ఫేస్ చేయ‌లేదు. దీంతో త‌ప్పుల‌ను స‌రి చేసుకుంటూ. కొత్త‌ద‌నం అందించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది