ధ‌డ‌క్ ట్రైల‌ర్ : జాన్వీ త‌డిపొడి అందాలు

Last Updated on by

అతిలోక సుంద‌రి న‌ట‌వార‌సురాలు జాన్వీ అతిలోక సుంద‌రి 2 అవుతుందా? ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌దేవి అభిమానుల సందేహ‌మిది. అభిమానుల క‌ల‌ల్ని జాన్వీ నెర‌వేరుస్తుందా? త‌ల్లి వార‌స‌త్వాన్ని, లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డంలో జాన్వీ స‌క్సెస‌వుతుందా? .. వేన‌వేల సందేహాలు ఫ్యాన్స్‌లో. అయితే ఇదిగో వీట‌న్నిటికీ ఇదే స‌మాధానం. వీడియో సాక్షిగా జాన్వీ ఇచ్చిన స‌మాధానం.

 

జాన్వీ న‌టించిన `ధ‌డ‌క్` ట్రైల‌ర్ రిలీజైంది. ఇదివ‌ర‌కూ రిలీజైన పోస్ట‌ర్ల‌తోనే ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో తెలిసిపోయింది కాబ‌ట్టి ట్రైలర్‌లో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలేవీ లేవు. అనాధ‌లైన నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్న‌ది ఆద్యంతం ఆస‌క్తిక‌రం. అంతేకాదు.. అంద‌రి ప్రేమికుల‌కు త‌గిలిన‌ట్టే ఇందులో ఈ ప్రేమ జంట‌కు ఓ విల‌న్ త‌గుల్తాడు. పోలీస్ జులుం ఎదుర‌వుతుంది? ఆ స‌న్నివేశాల్లో మాత్రం ఉద్వేగాన్ని ర‌గిలించారు ఇషాన్ ఖ‌త్త‌ర్‌, జాన్వీ. ప్రేమికుల్ని విడ‌దీసే పాడులోకం, మాయ‌దారి మ‌తిచెడిన లోకం సాక్షిగా ఈ సినిమాలో చెప్పుకోద‌గ్గ సీన్లు ఉన్నాయ‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది. ఇక ఈ ట్రైల‌ర్‌లో జాన్వీ ఎంతో అందంగా క‌నిపించింది. క‌ళ్ల‌తోనే మాయ చేసే సొగ‌సు ఈ అమ్మ‌డి సొంతం అని అర్థ‌మ‌వుతోంది. ఇషాన్ ఖ‌త్తార్ సైతం దొడ్డు ముక్కుతో అమాయ‌కంగా క‌నిపించాడు. ఆ పాత్ర‌కు అత‌డు సూట‌బుల్ అనిపించాడు. అయితే అంద‌రూ అనాధల్లా వీళ్లేమీ మ‌రీ మురికిప‌ట్టిన బ‌ట్ట‌లతో క‌నిపించ‌లేదు. కాస్తంత రిచ్‌లుక్‌లోనే చూపించారు. ఒరిజిన‌ల్ సైరాఠ్ లుక్ కంటే ఇది కాస్త డిఫ‌రెంట్ అనే అనిపిస్తోంది. ఇక జాన్వీ అతిలోక సుంద‌రి 2 అవుతుందా? లేదా? అన్న‌ది పూర్తి సినిమా చూసి చెప్పాలి. క‌ర‌ణ్ జోహార్ అండ్ టీమ్ ఈ జూన్‌లోనే ఈ బొమ్మ‌ను రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తోంది.

User Comments