ధ‌డ‌క్‌ గ్రాండ్ ఓపెనింగ్స్‌

Last Updated on by

జాన్వీ క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయిన సినిమా `ధ‌డ‌క్‌`. ఇషాన్ ఖ‌త్త‌ర్ క‌థానాయ‌కుడు. శ‌శాంక్ ఖైతాన్ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ శుక్ర‌వారం సినిమా థియేట‌ర్లోకి రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే ధ‌డ‌క్ రెండురోజుల వ‌సూళ్ల రిపోర్ట్ తాజాగా రివీలైంది.

బాక్సాఫీస్ వ‌ద్ద జాన్వీ మాయాజాలం ప‌ని చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమా కేవ‌లం శుక్ర‌, శ‌నివారాల్లో దాదాపు 19.25 కోట్ల నెట్ వ‌సూలు చేసింది. అంటే గ్రాస్ ప‌రంగా మ‌రింత మెరుగైన లెక్క‌లు తేలాయి. తొలిరోజు 9 కోట్లు, రెండో రోజు 11 కోట్లు వ‌సూలు చేసింది ధ‌డ‌క్‌. ఇక మెట్రో న‌గ‌రాల్లో జాన్వీ డెబ్యూ కార‌ణంగా మ‌రింత బెట‌ర్ రిజ‌ల్ట్ క‌నిపిస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. సినిమా క‌థ ప‌రంగా మామూలుగా ఉన్నా, జాన్వీ, ఇషాన్‌ల న‌ట‌న ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేస్తోంద‌ని, అది ప్ల‌స్ అయింద‌ని చెబుతున్నారు. అయితే ధ‌డ‌క్ ఓపెనింగ్స్‌ సైరాట్‌తో పోలిస్తే చాలా వ‌ర‌కూ పూర్ అనే చెప్పాలి. కేవ‌లం 4కోట్ల‌తో, ఎలాంటి న‌ట‌వార‌సులు లేకుండా తెర‌కెక్కిన మ‌రాఠా చిత్రం `సైరాట్‌` 100కోట్లు వ‌సూలు చేసింది. ఆ స్థాయి రిజ‌ల్ట్‌ని ధ‌డ‌క్ అందుకుంటుందా? అంటూ విశ్లేషిస్తున్నారు. కేవ‌లం మూడు రోజుల్లో 30కోట్లు వ‌సూలు చేసేస్తున్న ధ‌డ‌క్‌ రెండు వారాల్లో 70-80 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను అందుకుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జాన్వీ డెబ్యూ ఓ ర‌కంగా స‌క్సెస్ అయిన‌ట్టే. అయితే భారీ పెట్టుబ‌డులు పెట్టారు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు అంత‌కంత‌కు వ‌సూళ్లు పెర‌గాల్సి ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మెట్రో న‌గ‌రాల్లో ధ‌డ‌క్ కి ఆద‌ర‌ణ బావుంద‌ని తెలుస్తోంది.

User Comments