రిలీజ్ బరిలో అధర్వ `ధనం మూలం`

అధర్వ హీరోగా బద్రి వెంకటేష్ దర్శకత్వంలో కిక్ యాస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించిన `సెమ్మ బొథ ఆగతే` (డోంట్ గెట్ టూ హై) 2018లో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభిమోజు `ధనం మూలం` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. `కిక్కు ఎక్కిపోయెరా` అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ఇప్పటికే అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈనెలలోనే సినిమాని రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.

నిర్మాత రాజశేఖర్ మాట్లాడుతూ -“అధర్వ నటించిన యాక్షన్ స్టోనర్ థ్రిల్లర్ ఇది. మిస్తీ చక్రవర్తి అధర్వకు లవర్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆర్జీవీ డిస్కవరీ అనైక శోఠి వేశ్య పాత్రలో నటించింది. యువన్ శంకర్ రాజా సంగీతం ప్రధాన హైలైట్. అనువాద కార్యక్రమాలు ముగింపులో ఉన్నాయి. ఈనెలలోనే రిలీజ్ చేస్తున్నాం. తమిళంలోలానే తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది“ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణః వీర బ్రహ్మచారి అన్నాభిమోజు, బ్యానర్: గ్రే హాక్ మీడియా.