క‌బాలికి స్పాట్ పెట్టిన కాలా

Last Updated on by

Last updated on March 8th, 2018 at 01:07 pm

ఈ మ‌ధ్య కాలంలో హీరో ఎంట్రీ సీన్ అంటే వెంట‌నే మ‌రో మాట లేకుండా గుర్తొచ్చేది క‌బాలి. ఆ సినిమాలో జైల్ నుంచి ర‌జినీ అలా మెల్ల‌గా న‌డుస్తూ వ‌చ్చే సీన్ కేక పెట్టించాడంతే. రంజిత్ ఊహించిన ఆ సీన్ కు ర‌జినీ కూడా త‌న అభిన‌యంతో పిచ్చెక్కించాడు. ఇప్పుడు కాలాలో అంత‌కంటే భారీగా.. స్టైలిష్ గా ర‌జినీకాంత్ ఇంట్రో సీన్ ఉండ‌బోతుంద‌ని ఈ చిత్ర కెమెరామెన్ ముర‌ళి అంటున్నాడు. కాలా సినిమా చూసిన త‌ర్వాత ర‌జినీకాంత్ ను ఎలా పొగ‌డాలో కూడా ఎవ‌రికీ అర్థం కాదంటున్నాడు ఈయ‌న‌. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ కు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు కానీ రికార్డులు అయితే తిర‌గ‌రాస్తుంది. ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్ సాధించింది కాలా టీజ‌ర్. దానికి తోడు లైకులు కూడా 3.45 ల‌క్ష‌లు వ‌చ్చాయి.

త‌మిళ సినిమాల్లో ఇది రెండో అత్య‌ధికం. మొద‌టి స్థానంలో మెర్స‌ల్ ఉంది. ఎందుకో తెలియ‌దు కానీ మెర్స‌ల్ తో పోలిస్తే కాలా టీజ‌ర్ కు చాలా త‌క్కువ లైకులు.. వ్యూస్ వ‌చ్చిన‌ట్లు లెక్క‌. ధ‌నుష్ చేసిన చిన్న త‌ప్పు కాలాకు రికార్డుల్ని దూరం చేసాయి. చెప్పా పెట్ట‌కుండా అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు స‌డ‌న్ గా టీజ‌ర్ విడుద‌ల చేసాడు ధ‌నుష్. దాంతో ఉద‌యం వ‌ర‌కు టీజ‌ర్ వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. దాంతో అప్ప‌టికే చాలా వ్యూస్ న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది కాలా టీజ‌ర్. మొత్తానికి ఎలా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు అయితే మూడు భాష‌ల్లో క‌లిపి 2 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి ఈ చిత్రానికి. ఇది అయితే ఓ ర‌కంగా రికార్డే. ఏప్రిల్ 27న సినిమా విడుద‌ల కానుంది.

User Comments