త‌మిళ్ హీరోల‌కు ధ‌నుష్ వార్నింగ్

Last Updated on by

ఒక్క ముక్క కూడా ఆంగ్లంలో మాట్లాడ‌కుండా.. ఇక్క‌డ ఉన్న అధ్యాప‌కురాలికి అర్థం కాకుండా అంటూ అర్జున్ రెడ్డిలో ఓ డైలాగ్ ఉంటుంది అంద‌రికీ గుర్తుండే ఉంటుంది క‌దా..! అంత త్వ‌ర‌గా మ‌రిచిపోయే డైలాగ్ కాదులే అది. అచ్చంగా ఇదే త‌ర‌హాలో ఇప్పుడు ధ‌నుష్ కూడా త‌మిళ్ హీరోల‌కు ఓ వార్నింగ్ ఇచ్చారు. ఒక్క ముక్క తెలుగులో మాట్లాడ‌కుండా.. ప‌క్కాగా ఆంగ్లంలోనే అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా వార్నింగ్ ఇచ్చాడు ఈ హీరో. ఇండ‌స్ట్రీకి చాలా మంది హీరోలు ర‌జినీకాంత్ అవుదాం అని వ‌స్తార‌ని.. అంద‌రి టార్గెట్ ర‌జినీ అవ్వాల‌నే అని.. చాలా మంది సూప‌ర్ స్టార్ త‌ర్వాత మ‌రో సూప‌ర్ స్టార్ అవ్వాల‌ని ఆశ ప‌డుతున్నార‌ని.. కానీ అక్క‌డున్న‌ది ఒక్క‌డే ర‌జినీకాంత్.. ఆయ‌న్ని దాటే సీన్ ఎవ‌రికీ లేద‌ని తేల్చేసాడు ఈ అల్లుడు.

కాలా ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లోని పార్క్ హ‌య‌త్ లో జ‌రిగింది. అక్క‌డే ఈ మాట‌ల‌న్నీ మాట్లాడాడు ధ‌నుష్. అత‌డు ఎవ‌ర్నీ టార్గెట్ చేయ‌లేదు కానీ ధ‌నుష్ మాట‌ల్లో మాత్రం త‌మిళ‌నాట జ‌రుగుతున్న కుర్చీల వార్ ను గుర్తు చేసింది. ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి వెళ్లిపోతుండ‌టంతో అక్క‌డ నెక్ట్స్ నెం.1 ఎవ‌రు అనే టాపిక్ న‌డుస్తుంది.. దానికంటే కూడా త‌ర్వాతి ర‌జినీకాంత్ ఎవ‌రు అని విజ‌య్, అజిత్ మ‌ధ్య రేస్ న‌డుస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ధ‌నుష్ మాట్లాడిన ఈ మాట‌లు ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ర‌జినీ ఒక్క‌డే నెంబ‌ర్ వ‌న్ అని చెప్ప‌క‌నే చెప్పాడు ఈ హీరో. ఇప్పుడు కాలా హిట్టైతే ర‌జినీ మ‌రోసారి త‌న నెం.1 చైర్ ను నిల‌బెట్టుకున్న‌ట్లే..!

User Comments