టిక్కెట్టు పెంపు.. దిల్‌రాజు ద‌బాయింపు!!

IT Raids on Dil Raju Ahead of Maharshi Release
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `మ‌హ‌ర్షి` టిక్కెట్టు ధ‌ర‌ల పెంపు గురించి స‌ర్వ‌త్రా వాడి వేడిగా చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ- తెలంగాణ‌లో ఉన్న ఫ‌లాన అమాంతం టిక్కెట్టు ధ‌ర‌లు పెంచి థియేట‌ర్ య‌జ‌మానులు ఆటాడ‌డం మీడియాలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే ఈ పెంపు చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనా? అధికారికంగా టిక్కెట్టు ధ‌ర పెంపు జ‌రిగిందా? అంటూ నానా ర‌చ్చ సాగింది.
దీనిపై తాజాగా దిల్ రాజు త‌న కార్యాల‌యంలో వివ‌ర‌ణ ఇచ్చారు. మ‌హ‌ర్షి చిత్రాన్ని దాదాపు 2000 పైగా స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నామ‌ని నాన్ బాహుబ‌లి రికార్డులు బ్రేక్ చేస్తామ‌ని ఆయ‌న కాన్ఫిడెంట్ గా చెప్పారు. బాహుబ‌లి త‌ర్వాత అత్య‌ధిక స్క్రీన్ల‌లో రిలీజ‌వుతున్న సినిమా ఇద‌ని వెల్ల‌డించారు. 30 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను .. మ‌హ‌ర్షి త‌ప్ప‌కుండా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంది. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ కానే కాద‌ని అన్నారు.  టిక్కెట్టు రేట్ల‌పై మాట్లాడుతూ .. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 టికెట్ 110కి , మల్టీఫ్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచి రూ.150 చేశార‌ని వెల్లడించారు. దీనిపై ప్ర‌భుత్వ జీవో వ‌చ్చినా క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంద‌ని.. అదంతా క‌మ్యూనికేష‌న్ గ్యాప్ అని అన్నారు. అలాగే తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌లు అధికంగా పెంచార‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. ఏపీలో రూ.200 ఒక్కో టిక్కెట్టు అమ్ముతున్నార‌ని.. అది కూడా సింగిల్ స్క్రీన్ల‌లోనే ఇంత దండుకుంటున్నార‌ని అన్నారు. అలాగే బెంగ‌ళూరు లాంటి చోట్ల వీకెండ్స్ లో రూ.300-500 వ‌సూలు చేయ‌డాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇక మ‌హ‌ర్షి చిత్రానికి టిక్కెట్టు రేట్ల పెంప‌కం అన్న‌ది తెలంగాణ ప్ర‌భుత్వంతో సంబంధం లేదని థియేట‌ర్ య‌జ‌మానులే కోర్టు అనుమ‌తులు తెచ్చుకున్నార‌ని తెలిపారు. నిర్మాత‌ల‌కు దీనితో సంబంధం లేద‌ని అన్నారు.