టీజ‌ర్: దొంగ ఎందుక‌య్యాడు?

దొంగ అని పిలిచినంత మాత్రాన దొంగ అయిపోతాడా? అస‌లు దొంగ‌గా మార‌డానికి కార‌ణ‌మేంటో కూడా తెలియాలి క‌దా? సంఘం వెలేసినంత మాత్రాన అత‌డు దొంగ అయిపోతాడా? ఒక్కోసారి అక్క‌పై ప్రేమ కూడా దొంగ‌గా మార్చొచ్చు.. లేదా ప్రియురాలి కోసం అయినా దొంగ అయిపోవ‌చ్చు. ఇన్ని షేడ్స్ క‌నిపిస్తున్నాయి దొంగ టీజ‌ర్ లో. కార్తీ న‌టించిన ఈ సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కి రాబోతోంది. ఇప్ప‌టికే ప‌బ్లిసిటీలో వేగం పెంచింది టీమ్. ఈ చిత్రానికి మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దృశ్యం లాంటి క్లాసిక్ తెర‌కెక్కించిన ఆయ‌న నుంచి మ‌రో మాస్ట‌ర్ క్లాస్ సినిమా రాబోతోంద‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

దొంగ‌ టీజ‌ర్ లో కార్తీ కి త‌న అక్క పార్వ‌తిగా న‌టించిన జ్యోతిక‌కు మధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్ ని చూపిస్తున్నారు. స‌త్య‌రాజ్ వీరికి తండ్రిగా న‌టించారు. త‌మ్ముడు దొంగ అయ్యి ఇల్లు వ‌దిలి వెళ్లాక అక్క తన‌కోసం ఎంత‌గా వేచి చూసిందో ఆ ఆవేద‌న ఏమిటో టీజ‌ర్ లోనే చూపించారు. విక్కీ, గురూ, అర్జున్ అంటూ ఒక్కో ప్లేస్ కి ఒక్కో పేరు పెట్టుకుని తిరిగే దొంగ‌గా కార్తీ ఆహార్యం కొత్త‌గానే క‌నిపించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌డి గెట‌ప్పులు కూడా వెరైటీగానే ఉన్నాయి. చూడాలి ఖైదీ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో హిట్టు కొడ‌తాడేమో కార్తీ. అక్క త‌మ్ముళ్ల సెంటిమెంటు ఈ సినిమాకి ఏమేర‌కు క‌లిసొస్తుందో చూడాలి. వ‌యాకామ్ 18 స్టూడెంట్స్- ప్యార‌ల‌ల్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.