ధూమ్ 4 ఇంకా ప్ర‌భాస్ కోర్టులోనే

Prabhas - File Photo

బాలీవుడ్ లో ధూమ్ ఫ్రాంఛైజీ సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో ఇప్ప‌టికే మూడు సినిమాలు రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాలు సాధించాయి. భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ సిరీస్ లో హృతిక్ రోష‌న్.. అమీర్ ఖాన్ గ‌తంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. ఇప్పుడు ఈ సిరీస్ లో నాలుగో భాగం తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తోంది య‌శ్ రాజ్ సంస్థ‌.

ఈసారి ఖాన్ ల స్థానంలో బాహుబ‌లి ప్ర‌భాస్ కి ఆ అవ‌కాశం ఇచ్చేందుకు య‌శ్ రాజ్ సంస్థ ఆస‌క్తిగా ఉంద‌ని ఇంత‌కుముందు వార్త‌లొచ్చాయి. ప‌లుమార్లు ప్ర‌భాస్ య‌శ్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రాని క‌ల‌వ‌డంతో అందుకు సంబంధించిన ఊహాగానాలు సాగాయి. అయితే అస‌లు ధూమ్ 4 టాపిక్ లేనేలేద‌ని ప్ర‌భాస్ ఖండించ‌డంతో అప్ప‌ట్లో ఫుల్ స్టాప్ ప‌డినా.. మ‌రోసారి అవే పుకార్లు టాలీవుడ్ స‌ర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయి. ధూమ్ 4 ఆఫ‌ర్ ఇంకా ప్ర‌భాస్ కోర్టులోనే ఉంది. కానీ అత‌డు త‌ట‌ప‌టాయిస్తున్నాడు! అంటూ ప్ర‌చారం అవుతోంది. మ‌రోవైపు ప్ర‌భాస్ జాన్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. 2020 జ‌న‌వ‌రిలో అత‌డు జాన్ సెట్స్ లోకి జాయిన్ అవుతాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం విదేశీ వెకేష‌న్ ని ముగించి తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చాక కానీ ఏదీ తేల‌ద‌న్న ముచ్చ‌టా అభిమానుల్లో సాగుతోంది.