బాల‌య్య జంట పీఆర్వోల‌ను గెంటేశారా

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ లో ఫైరింగ్ యాంగిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న‌సు నిమ్మ‌లంగా  ఉంటే ఎంత ప్ర‌శాతంగా ఉంటారో.. ఏదైనా తేడా జ‌రిగితే అంతే ఆగ్ర‌హానికి గురైన వీడియోలు ఇప్ప‌టికే చూసిన సంద‌ర్భాలున్నాయి. ఉద్యోగులు న‌చ్చారంటే నెత్తిన పెట్టుకుంటారు….అందులో ఏదైనా తేడాలు చేస్తే ద‌రిదాపుల్లో కూడా రానివ్వ‌రు. ప్ర‌స్తుతం ఓ ఇద్ద‌రు పీఆర్వోల  ప‌రిస్థితి అదేన‌ని టాలీవుడ్ మీడియా స‌హా అంద‌రిలోనూ ఆస‌క్తిక‌రంగా మారింది. లెజెండ్, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రాల‌కు పీఆర్ గా ప‌నిచేసిన ఆ జంట పీఆర్ ఓ ల‌ను బాల‌య్య కాంపౌండ్ నుంచి గెంటేసారుట‌. జీవితంలో ఎప్పుడూ మ‌ళ్లీ కాంపౌండ్ లో కాలు పెట్టొద్ద‌ని హెచ్చ‌రించారుట‌. ఇంత‌కీ బాల‌య్య ఆగ్ర‌హం  క‌ట్ట‌లు తెంచుకోవ‌డానికి కార‌ణం ఏంటి? అంత‌గా  ఆ జంట పీఆర్వోలు చేయకూడ‌ని ప‌నేం చేసారంటే? అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

బాల‌య్య  ముద్దుల కుమారుడు  మోక్ష‌జ్ఞ తో స‌న్నిహితంగా మెలిగి, మేము బాల‌య్య బాబు,  మోక్ష కి వీరాభిమానులం అంటూ ప్ర‌చారం చేసుకుంటు విర్ర‌వీగారుట‌. సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో మోక్ష‌జ్ఞ‌ ఫోటోల‌ను పైనే  వేసి, క్రింద త‌మ ఫోటోల‌ను వేసుకుని ప్ర‌చారం చేసుకున్నారుట‌. అదే గాకుండా మోక్ష‌జ్ఞ‌కు  సంబంధించిన వ్య‌క్తి గ‌త విష‌యాల‌ను లీక్ చేసారుట‌. ఇటీవ‌లే మోక్ష‌జ్ఞ కుటుంబంతో క‌లిసి దిగిన ఫోటో ఒక‌టి లీకైంది. అందులో  మోక్ష‌జ్ఞ ఒళ్లు చేసి, ఉబ్బెత్తు పొట్ట‌తో క‌నిపించాడు. దీంతో సోష‌ల్ మీడియాలో ఏ రేంజ్ లో కామెంట్లు వ‌చ్చాయో తెలిసిందే. వీట‌న్నింటికి కార‌కులు వాళ్లేన‌ట‌. ఇది ఆ నోటా ఈనోట చివ‌రికి బాల‌య్య చెవిన ప‌డిందిట‌.  దీంతో వెంట‌నే ఆ ఇద్ద‌ర్ని పిలిచి వార్నింగ్  ఇచ్చి బ‌య‌ట‌కు గెంటేసిన‌ట్లు  గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  ఆ ద్వ‌యం  బాల‌య్య కాంపౌండ్ లో అడుగు పెట్ట‌క‌ముందు బాల‌య్య కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసిన సంద‌ర్భాలున్నాయి. ఎన్టీఆర్ పైనా బాల‌య్య వైరం గురించి ప్ర‌చారం చేసింది వీళ్లేన‌న్న టాక్ బ‌య‌ట ఉది. తాజా ప‌రిస్థితుల‌ నేప‌థ్యంలో ఆ ద్వ‌యం బాల‌య్య కాంపౌండ్ కి పూర్తిగా దూర‌మైన‌ట్లేన‌ని తెలుస్తోంది.