బిగ్ బాస్ విన్న‌ర్ స్నేహం మ‌రిచాడా!

Rahul Siplingunj - File Photo

బిగ్ బాస్  సీజన్ -3 విజేత‌గా సింగ‌ర్ రాహుల్ సిప్లింగజ్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అతని పేరు  మీడియాలో హాట్ టాపిక్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన అంచెలంచెలుగా ఎదిగాడు. బిగ్ బాస్ తెచ్చిన పేరుతో మ‌రిన్ని అవకాశాలు వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా  ప‌లు ఇంట‌ర్వూల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌ను అనుభ‌వాల‌ను చెప్పుకొస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో  త‌ను ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త‌లో ఎలా ఉండేవాడు? ఎవ‌రెవ‌రిని కలిసాడు? వ‌ంటి కొన్ని ఆధారాలు ఫోటోలు రూపంలో బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌న సృష్టిస్తోంది.

రాహుల్  ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన కొత్త‌లో ఎలా ఉండేవాడు? ఎవ‌రితో ఎక్కువ‌గా మెలిగే వాడు? వ‌ంటి అంశాల‌ను ప‌లు ఇంట‌ర్వూల్లో దాచి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇదిగో ఇక్క‌డిలా  ఓ సినిమా ప్రెస్ మీట్ లో  రాహుల్ నూనుగు మీసాలు రాకుండానే ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆప‌క్క‌నే ఉన్న‌ది  వేంగి సుధాక‌ర్  అనే యువ సంగీత ద‌ర్శ‌కుడు. అత‌ని ద్వారానే ర‌చ‌నా దిగ్గ‌జం వేటూరిని రాహుల్  ఓ సంద‌ర్భ‌లో క‌లిసిన‌ట్లు  తెలుస్తోంది. అలాగే వెంగీతో  ప‌లు హిట్టు  సినిమాల‌కు రాహుల్ క‌లిసి ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ ని ప్రోత్స‌హించ‌డంలో వెంగి సుధాక‌ర్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు అప్ప‌ట్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.  వెంగీ తో పాటు, ప‌లు సినిమా ఈవెంట్ల‌లో పాల్గొన్న‌ట్లు పిక్స్ ను బట్టి తెలుస్తోంది. కానీ ఈ విష‌యాలేవి రాహుల్ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. బిగ్ బాస్ లో రాహుల్  ఓ టాస్కుల్లో భాగంగా లైఫ్ గ్రాఫ్ వేసాడు. ఆగ్రాఫ్ లో ఈ ప‌దేళ్ల  ప్ర‌స్థావ‌న తీసుకురాపోవ‌డం గ‌మ‌నార్హం. త‌న అనుభ‌వాన్ని కేవ‌లం పెద్ద సినిమాల‌కే ప‌రిమితం చేసాడు. మ‌రి ఒక‌ప్పటి స్నేహితుడిని,  ఆ సంగీత ద‌ర్శ‌కుడి తో ప్ర‌యాణాన్ని రాహుల్ ఎందుకు విస్మ‌రించారో ఆయ‌న‌కే తెలియాలి. స్నేహం గొప్ప‌ది. అందులో కొల‌మానాలుండ‌వు. మ‌రి రాహుల్  స్నేహంలో కొల‌మానాలేమిటో అన్న‌ది అత‌నికే వ‌దిలేద్దాం.