ద‌ర్బార్ కోసం మ‌హేష్ ఒప్పుకోలేదా?

Darbar - File Photo
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా  మురగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ర్బార్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. దీంతో యూనిట్ ప్ర‌చారం మొద‌లు పెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కూ నేరుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చార చిత్రాల‌ను రిలీజ్ చేశారు. తాజాగా ద‌ర్బార్ టీమ్ అన్ని భాష‌ల స్టార్ హీరోల చేతుల మీదుగా మోష‌న్ పోస్ట‌ర్లు రిలీజ్ చేస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్- స‌ల్మాన్- మోహ‌న్ లాల్ వంటి స్టార్ల‌ను బ‌రిలో దించారు ఇప్ప‌టికే. తాజాగా తెలుగు ప్ర‌మోష‌న్స్ కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబునే బ‌రిలో దించారు. ఈరోజు సాయంత్రం స‌రిగ్గా 5.30 ల‌కు ద‌ర్బార్ మోష‌న్ పోస్ట‌ర్ ని  మ‌హేష్ బాబు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ముర‌గ‌దాస్ అధికారికంగా ట్విట‌ర్ ద్వారా తెలిపారు.
ద‌ర్బార్ స‌ర్ ప్ర‌యిజ్ అంటూ మహేష పిక్ ని ద‌ర్బార్  పోస్ట‌ర్ పై వేసి సోష‌ల్ మీడియాలో ప్ర‌చారానికి వ‌దిలారు. మ‌రి ఈ షాకింగ్ సర్ ప్ర‌యిజ్ కి కార‌ణం ఏంటో?  గ‌తంలో మ‌హేష్ బాబు- ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో స్పైడ‌ర్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే.  భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన సినిమా తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. ఈ నేప‌థ్యంలో అభిమానులు స‌హా తెలుగు ఆడియ‌న్స్  ముర‌గ‌దాస్ పై నెగిటివ్ కామెంట్లు పెట్టారు. స్పైడ‌ర్ త‌ర్వాత విజ‌య్ తో  పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో స‌ర్కార్ ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.
ఆ సినిమా త‌మిళ్ స‌హా తెలుగులోనే బాగా ఆడింది. ఈ నేప‌థ్యంలో అంత మంచి క‌థ‌తో మ‌హేష్ తో ఎందుకు చేయ‌లేదు అంటూ.. మాతృభాష‌? ప‌ర‌భాష  అనే విబేధం చూపిస్తున్నాడ‌ని మ‌హేష్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. మ‌రి ఈ వ్య‌తిరేక ప్ర‌చారానికి .. ముర‌గ ఇస్తోన్న తాజా స‌ర్ ప్రైజ్ కి ఏదైనా లింకు ఉందా? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి మ‌హేష్‌- ముర‌గ‌దాస్ ఏమంటారో?