మ‌హేష్ ఫ్యాన్స్ లో డిఫ‌రెన్సెస్?

సింగ‌పూర్ మ్యాడ‌మ్‌ టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది హీరోల్లో ఆ ఘనత సాధించిన క్రేజీ స్టార్ గా మ‌హేష్ పేరు మార్మోగుతోంది. అయితే అత‌డి విగ్ర‌హాన్ని సింగపూర్‌ మ్యూజియంలో ఉంచితే.. ఇక్కడ నుండి వెళ్లి ఆ విగ్రహాన్ని చూడాలంటే అభిమానుల‌కు కుదిరే పనికాదు. అందుకే వారిని నిరుత్సాహపడకుండా ఉండేందుకు ఈ విగ్రహాన్ని నేడు హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ గచ్చీబౌలిలోని ఏఎంబి సినిమాస్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్క‌రిస్తున్నారు. అనంతరం ఈ విగ్రహాన్ని ఒకరోజు పాటు ప్రదర్శనకు ఉంచుతారు. తరువాత సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. మొత్తానికి సూపర్ స్టార్ కి ఇది అరుదైన గౌరవం. మ్యాడ‌మ్ టుస్సాడ్స్ ప్ర‌య‌త్నానికి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటుపై ఎఫ్ 2 ఫేం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో కెరీర్ 26వ చిత్రంలో న‌టిస్తారు. ఇక ఈ ఈవెంట్ ని ఫ్యాన్స్ స‌మ‌క్షంలో మ‌హేష్ ఘ‌నంగా నిర్వ‌హించ‌డం మ‌రో హైలైట్.

అయితే ర‌క‌ర‌కాల కాంటెస్టుల పేరుతో మ‌హేష్ బెస్ట్ 5 ఫ్యాన్స్ ని ఎంపిక చేసి వారికి మాత్ర‌మే మ‌హేష్ ని క‌లిసే అవ‌కాశం క‌ల్పించ‌డంతో ఫ్యాన్స్ లో కాస్తంత కోపం క‌నిపిస్తోంద‌ట‌. మ‌రి వేలాదిగా త‌ర‌లి వ‌చ్చే అభిమానుల‌తో ఏఎంబీలో తుఫాన్ త‌ప్ప‌దేమో! మ‌రి అంత‌మంది ఫ్యాన్స్ ని సంతుష్టుల్ని చేసేందుకు మ‌హేష్‌- న‌మ్ర‌త టీమ్ ఇంకేం ప్లాన్ చేస్తారో చూడాలి.