ఆదిలోనే హంస‌పాదు..`మా` లో చీలిక‌?

Last Updated on by

`మా` నూతన కార్య‌వ‌ర్గానికి ఆదిలోనే హ‌సంపాదు ఎదురైంద‌ని నిన్న‌టి రోజున ఎదురైన స‌న్నివేశాన్ని బ‌ట్టే తెలుస్తోంది. న‌రేష్ అంతా నేనే..నేనే చెస్తాను..చేసాను వంటి మాట‌లు జీవిత‌, రాజ‌శేఖ‌ర్, హేమ లో మంట‌ని ర‌గిల్చిన సంగ‌తి తెలిసిందే. మాట్లాడుత‌న్న‌ప్పుడే మ‌ధ్య‌లోనే ఒక‌రి మైక్ ను మ‌రోక‌రు లాక్కొని చేసిన ర‌చ్చ అంతా కాదు. దీంతో న‌రేష్ ఒక్క‌డే ఒక‌వైపు ఉంటే? జీవిత‌, రాజ‌శేఖ‌ర్, హేమ ఒక‌వైపు కు వ‌చ్చేసారు. జీవిత రాజ‌శేఖ‌ర్, న‌రేష్ ప్యాన‌ల్ తురుపున గెలిచినా, ఇండిపెండెంట్ గా గెలిచిన హేమ వైపు రావ‌డం ఆస‌క్తికి, అనుమానాల‌కు తావిస్తోంది. దీనిపై అప్పుడే మిగ‌తా మా స‌భ్యుల్లో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. 800 మంది స‌భ్యులున్నా `మా`ని రెండుగా చీల్చే యోచ‌న‌లో ఓ వ‌ర్గం అప్పుడే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింద‌ని ఫిలిం సర్కిల్స్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు, ఆరోప‌ణ‌లు ఎంత దూరం వెళ్తాయో చెప్పాల్సిన ప‌నిలేదు. వాస్త‌వానికి `మా` మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా, ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేష్ విష‌యంలో ముందుగా ఇలాటి స‌మ‌స్య‌లే త‌లెత్తాయి. శివాజీ రాజా, న‌రేష్ ని ప‌ట్టించుకోలేద‌ని, త‌న‌కి ఏ విష‌యం చెప్ప‌కుండా అన్నీ తానే చేస్తున్నాడ‌ని న‌రేష్ ఓ సంద‌ర్భంలో ఆరోపించాడు. పిలిచిన ప్ర‌తీసారి న‌రేష్ రాలేద‌ని శివాజీ రాజా బ‌ధులివ్వ‌డం జ‌రిగింది. అలా మొద‌లైన క‌థ ఎలా ముగిసిందో? అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నూత‌నంగా ఏర్పాటైన కార్య‌వ‌ర్గంలో అలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వ్వ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

Also watch: Nikki Pooja Latest Stills

User Comments