దిల్‌రాజు రిలీజ్ తేదీలివే..

Last Updated on by

దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు! దిల్‌రాజును చూస్తే ప్ర‌తి ఒక్క‌డికి అర్థ‌మ‌య్యే పాయింట్ ఇది. ఏం చేస్తే మార్కెట్‌ని జేబులో వేసుకోవ‌చ్చో, ఏ గేమ్ ఆడితే థియేట‌ర్ల‌ను గుప్పిట ప‌ట్ట‌వ‌చ్చో వ్యూహం తెలిసిన బ‌హుముఖ మేధావి. అందుకే ఆ ముగ్గురితో క‌లిసి నాలుగోవాడిగా చేరి, ఆటాడుకుంటూ ఉంటాడు ఇండ‌స్ట్రీని. నే ఆడితే లోక‌మే ఆడ‌దా! అన్న చందంగా ఆయ‌న ఆడే ఆట మామూలుగా ఉండ‌దు. 2017లో అత‌డు రిలీజ్ చేసిన ప్ర‌తి సినిమా హిట్ట‌య్యింది. ఆరు విజ‌యాలు ఒకే ఏడాదిలో అందుకున్న ఏకైక నిర్మాత ఎవ‌రైనా ఉన్నారు అంటే అది దిల్‌రాజు మాత్ర‌మే.

ప్ర‌స్తుతం యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన లవర్ చిత్రాన్ని ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ల‌వ‌ర్ ఇలా విడుద‌ల‌వ్వ‌గానే.. ఆ వెంట‌నే నితిన్, రాశి ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వం వ‌హించిన `శ్రీనివాస కళ్యాణం` ఆగష్టు 9న రిలీజ్ చేస్తాడు. అటుపై రామ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వ‌హిస్తున్న `హలో గురు ప్రేమ కోసమే` చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ‌వుతుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ – అనిల్ రావిపూడి కాంబో మూవీ ఎఫ్2 ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తాడు. మ‌హేష్ 25వ సినిమా ఉగాది కానుకగా 2019 ఏప్రిల్ 25న విడుదల చేస్తాడుట‌. ఇంత పెద్ద లైన‌ప్ ఉన్న వేరొక నిర్మాత ఉన్నాడా? ఇండ‌స్ట్రీలో? అందుకే అత‌డు దిమాకున్నోడు.

User Comments