మ‌హ‌ర్షికి రాజుగారి స‌ర్ ప్రైజ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీ `మ‌హ‌ర్షి` మే 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ కెరీర్ లో 25 సినిమా ఇది. దిల్ రాజు, అశ్వీనిద‌త్, పీవీపీలు నిర్మాణం విష‌యంలో ఏ మాత్రం రాజీ ప‌డ‌కుండా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో హీటెక్కించారు. లిరిక‌ల్ స్టాంగ్స్ ను ఒక్కొక్క‌టిగా వ‌దులుతూ శ్రోత‌ల్ని అల‌రిస్తున్నారు. ఇక సిస‌లైన ఈవెంట్ ప్రీ రిలీజ్ కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మే 1న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ లో ప్లాన్ చేస్తున్నారుట‌. ఈ వెంట్ లో దిల్ రాజు మ‌హ‌ర్షికి స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్నాడుట‌.

ఏంటా స‌ర్ ప్రైజ్ అంటే? మ‌హేష్ కి 25వ సినిమా కావ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులంద‌ర్నీ అతిధులుగా ఆహ్వానించనున్నాడుట‌. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కులందర్నీ మ‌హేష్ స‌న్మానించ‌నున్నాడుట‌. మ‌హేష్ సూప‌ర్ స్టార్ అయ్యాడంటే? వాళ్లంద‌రి కృషి వల్లే. మ‌హేష్ ఎదుగుద‌ల‌లో ఈ 25 మంది ద‌ర్శ‌కులున్నారు. అందుకే రాజుగారు ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `దువ్వాడ జ‌గ‌న్నాథం` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజుగారు ఇలా ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.