రాజు గారి ప్లానింగ్ కు తిరుగులేదు

Last Updated on by

దిల్ రాజు ముందు పుట్టి.. ఆ త‌ర్వాత ఆయ‌న కోస‌మే ప్లానింగ్ పుట్టిన‌ట్లుంది. లేక‌పోతే మ‌రేంటి.. ఇక్క‌డ ఏడాదికి ఒక్క సినిమా నిర్మించ‌డానికే నానా తంటాలు ప‌డుతున్నారు కొంద‌రు నిర్మాత‌లు. అలాంటిది 2017లో రికార్డ్ స్థాయిలో ఆరు సినిమాలు నిర్మించాడు దిల్ రాజు. మ‌ళ్లీ అన్నీ క‌మ‌ర్షియ‌ల్ గా బాగానే ఆడాయి. మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ లు కూడా ఉన్నాయి. ఏదో ఓ ఏడాది అంటే అలా కుదిరింది అనుకోవ‌చ్చు అనుకుంటే ఇప్పుడు మ‌రోసారి ఇదే ఫీట్ చేయ‌డానికి రెడీ అవుతున్నాడు రాజు. 2018లో కూడా దిల్ రాజు గారి ర‌చ్చ మామూలుగా లేదు. ఆగ‌స్ట్ నుంచి త‌న దూకుడు చూపించ‌బోతున్నాడు ఈ నిర్మాత‌. ఈ నెల‌లో రాజ్ త‌రుణ్ ల‌వర్ సినిమా విడుద‌ల కానుంది. అనీల్ కృష్ణ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్త‌యింది. వ‌ర‌స ప్లాపుల్లో ఉన్న రాజ్ త‌రుణ్.. రాజుగారి సినిమాపైనే ఆశ‌లు పెట్టుకున్నాడు.

ఇక ఆగ‌స్ట్ 3న నితిన్ శ్రీ‌నివాస క‌ళ్యాణం విడుద‌ల కానుంది. స‌తీష్ వేగ‌శ్న తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది. చండీఘ‌ర్ లో ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ లో రామ్ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే విడుద‌ల కానుంది. ఈ మూడు సినిమాలు మూడు నెల‌ల్లో రానున్నాయి. ఇక మ‌హేష్-వంశీ పైడిప‌ల్లి.. వ‌రుణ్ తేజ్-వెంక‌టేశ్ ఎఫ్ 2.. హ‌రీష్ శంక‌ర్ దాగుడు మూత‌లు కూడా లైన్ లోనే ఉన్నాయి. వాటికితోడు కొత్త ద‌ర్శ‌కుడు శ‌శితో అదేనువ్వు అదేనేను అనే సినిమా కూడా అనౌన్స్ చేసాడు దిల్ రాజు. మ‌రి ఈయ‌న ప్లానింగ్ ఈ ఏడాది కూడా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి..!

User Comments