దిల్ రాజు టెన్ష‌న్ ప‌డుతున్నాడు

Last Updated on by

టెన్ష‌న్ నే టెన్ష‌న్ పెట్టి తాను కూల్ గా ఉంటాడు దిల్ రాజు. అలాంటి నిర్మాత కూడా ఇప్పుడు టెన్ష‌న్ ప‌డుతున్నాడు. దానికి కార‌ణం ఓ చిన్న చిత్రం. స్టార్ హీరోలతో సినిమాలు చేసిన‌పుడు కూడా కంగారు ప‌డ‌ని రాజు గారు.. ఇప్పుడు రాజ్ త‌రుణ్ సినిమా చేసి కంగారు ప‌డుతున్నాడు. దానికి ఓ కార‌ణం కూడా లేక‌పోలేదు. డిస్ట్రిబ్యూట‌ర్ గా ఎలా ఉన్నా.. నిర్మాత‌గా మాత్రం ఏడాదిగా దిల్ రాజు టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా 2017లో వ‌ర‌స‌గా ఆరు సినిమాలు నిర్మించాడు. అయితే ఇప్పుడు 2018ని మాత్రం రాజ్ త‌రుణ్ ల‌వ‌ర్ సినిమాతో మొద‌లు పెడుతున్నాడు ఈ నిర్మాత‌.

ఇప్పుడు రాజ్ చాలా దారుణ‌మైన డిజాస్ట‌ర్ల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈయ‌న సినిమాల‌కు క‌నీసం కోటి షేర్ కూడా రావ‌డం లేదు. ఇలాంటి టైమ్ లో దిల్ రాజు ఈయ‌న‌తో ల‌వ‌ర్ సినిమా నిర్మించాడు. అనీష్ కృష్ణ ద‌ర్శ‌కుడు. రాజ్ త‌రుణ్ ను తాను మార్చ‌డం కాదు.. ఆ కుర్రాడి ఫ్లాపుల గోల త‌న‌కెక్క‌డ అంటుకుంటుందేమో అని టెన్ష‌న్ ప‌డుతున్నాడు దిల్ రాజు. ఎలాగూ ఇప్పుడు వెన‌క్కి తిరిగి వెళ్ల‌లేదు.. ఆల్రెడీ నిర్మించేసాడు. మొన్న విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు కూడా పెద్ద‌గా ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు. మ‌రి ఇప్పుడు ల‌వ‌ర్ ఎలా ఉంటాడో చూడాలంటే జులై వరకు వెయిట్ చేయాల్సిందే.

User Comments