చెర్రీ ఎందుకా డైలెమ్మా?

Last Updated on by

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విష‌య‌మై డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ అధినేత దాన‌య్య‌లో డైలెమ్మా కొన‌సాగుతోందిట‌. ఈ సినిమా రిలీజ్ అక్టోబ‌ర్ లేదా సంక్రాంతి బ‌రిలో ఉండాల‌ని స‌ద‌రు నిర్మాత భావిస్తున్నార‌ని తెలిసింది. ఆ రెండు తేదీలు అయితే సినిమా విజ‌యానికి క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నార‌ట‌.

అయితే ఇక్క‌డే ఓ చిక్కు ఉంది. 2019 సంక్రాంతి బ‌రిలో రామ్‌చ‌ర‌ణ్ సినిమాని రిలీజ్ చేయడం కుద‌రదు. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం `సైరా- న‌ర‌సింహారెడ్డి` రిలీజ్ కానుంది. ఒక‌వేళ అనుకోని కార‌ణాల‌తో ఆ సినిమా రిలీజ్ వాయిదా ప‌డి స‌మ్మ‌ర్ రేసులోకి వెళితే అప్పుడు పున‌రాలోచించుకునే అవ‌కాశం ఉంటుంది. సంక్రాంతి రిలీజ్ అవ‌కాశాన్ని చ‌రణ్ ఎట్టి ప‌రిస్థితిలో వ‌దులుకోడు. నిర్మాత‌ల‌కు అదే శిరోధార్యం. అయితే
చ‌ర‌ణ్ మూవీ రిలీజ్‌పై ఇప్ప‌టికి క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. `సైరా న‌ర‌సింహారెడ్డి` రిలీజ్ తేదీ ఫిక్స‌య్యేవ‌ర‌కూ ఇదే స‌న్నివేశం కొన‌సాగుతుంద‌ని చెబుతున్నారు. ఆ మేర‌కు నిర్మాత దాన‌య్య‌ను కాస్త వేచి చూడాల్సిందిగా చ‌ర‌ణ్ అభ్య‌ర్థించాడ‌ట‌. ఇండియాలోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా దాదాపు 200కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సైరా చిత్రానికి చ‌ర‌ణ్ నిర్మాత‌. అలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సినిమా రిలీజ్ తేదీ కోసం ఆమాత్రం వేచి చూడ‌డంలో త‌ప్పేం లేద‌ని దాన‌య్య భావిస్తున్నారని తెలిసింది. చెర్రీ సినిమాని సంక్రాంతి .. కుద‌ర‌క‌పోతే ఈఏడాది అక్టోబ‌ర్ రిలీజ్ చేసేందుకు ఉన్న ఆస్కారాన్ని ప‌రిశీలిస్తున్నారుట‌.

User Comments