డైలాగులు త‌క్కువ ఛేజ్‌లు ఎక్కువ‌

Tamannah - File Photo

మిల్కీ వైట్ బ్యూటీ ఇన్నాళ్లు త‌న‌దైన గ్లామ‌ర్ తో యువ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంది. బాహుబ‌లి చిత్రంలో అవంతిక‌గా త‌న‌దైన అందంతో మురిపించింది. ఇప్పుడు ఏకంగా ఫైట్స్ ఛేజ్ లు అంటూ అభిమానుల‌కు ఓ డిఫ‌రెంట్ యాంగిల్ ని చూపించ‌బోతోంది. ఇప్ప‌టికే రిలీజైన భారీ చిత్రం `యాక్ష‌న్` ట్రైల‌ర్ లో త‌మ‌న్నా స్టంట్స్ మైండ్ బ్లోవింగ్ అంటూ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఈనెల 15న సినిమా విడుదల కానుంది. తాజా ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి త‌మ‌న్నా త‌న రోల్ గురించి విశాల్ రోల్ గురించి వెల్ల‌డించింది.

విశాల్- నేను ఈ చిత్రంలో కమాండో ఆఫీసర్స్ గా కనిపిస్తాం. క‌మెండో ఆప‌రేష‌న్ లో భాగంగా భారీ ఛేజ్ లు చేస్తాం. సాహ‌సాల‌కు కొద‌వేమీ ఉండ‌దు. సీరియస్ కమాండో ఆఫీసర్ గా చేస్తున్నా.. విశాల్ తో రొమాన్స్ ఎక్క‌డా త‌గ్గ‌దు. అందుకే ఈ మూవీలో నా రోల్ చాలా స్పెషల్ అని తెలిపారు. ఒక ఆర్టిస్ట్‌గా ఎప్పుడూ కొత్త తరహా పాత్రలు చేయాలనే కోరుకొంటాను. అటువంటి విభిన్న పాత్రలకు నన్ను ఎంపిక చేస్తున్న దర్శకనిర్మాతలకు ఎంతైనా రుణపడి ఉంటాను అని అన్నారు. హాలీవుడ్‌ యాక్షన్ సినిమాలు చూస్తే అందులో క‌థానాయిక‌లు గ్లామరెస్‌గా కనిపిస్తూనే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ సినిమాలో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమా చూశాక‌ హీరోయిన్ల కోసం ప్రత్యేకంగా యాక్షన్‌ సీన్లు రాయాలి అనిపించేలా యాక్షన్‌ సీన్లు ఉంటాయి. దర్శకుడు సుందర్‌ నా పాత్ర అంత స్ట్రాంగ్‌గా డిజైన్‌ చేశారు. డైలాగ్స్ త‌క్కువ ఫైట్లు.. ఛేజింగ్స్‌ ఎక్కువ అని తెలిపారు మిల్కీ.