దిల్‌రాజు కాంపౌండ్ హీరో

Last Updated on by

మెగా కాంపౌండ్, నంద‌మూరి కాంపౌండ్, అక్కినేని కాంపౌండ్, ద‌గ్గుబాటి కాంపౌండ్‌, మంచు కాంపౌండ్ అంటూ ప‌లు కాంపౌండ్‌లు టాలీవుడ్‌కి హీరోల్ని ఉత్ప‌త్తి చేస్తూ సేవ‌లందిస్తున్నాయి. ఒక్కో కాంపౌండ్ నుంచి అర‌డ‌జ‌ను నుంచి డ‌జ‌ను వ‌ర‌కూ హీరోలు రంగ ప్ర‌వేశం చేయ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చ‌ర్చ అనంతంగా భువ‌న‌భాండం మార్మోగిపోయేలా సాగుతోంది. నెప్టోయిజం.. న‌ట‌వార‌స‌త్వం అంటూ టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోల్ని ఏకేసే బ్యాచ్‌లు త‌యార‌వుతున్నాయ్‌!

అదంతా అటుంచితే టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంపౌండ్ త‌యార‌వ్వ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతోంది. అదే దిల్‌రాజు కాంపౌండ్. ఇన్నాళ్లు ఈ కాంపౌండ్ ఉన్నా.. హీరోల్ని ఉత్ప‌త్తి చేసే కాంపౌండ్‌గా ముద్ర ప‌డలేదు. ఇక ఇన్నాళ్టికి దిల్‌రాజు సోద‌రుని బిడ్డ హీరోగా అందొచ్చాడు. త‌న కాంపౌండ్ కో ప్రొడ్యూస‌ర్ కం బ్ర‌ద‌ర్ శిరీష్ త‌న‌యుడు అర్షిత్‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్టు రెడీ అయ్యింది. ఇంత‌కీ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అంటే.. వేణు శ్రీ‌రామ్ స‌హాయ‌కుడు స‌తీష్ ఫిక్స‌య్యాడ‌ని, ఆగ‌స్టులో సెట్స్‌పైకి వెళుతున్నార‌ని తెలుస్తోంది. ఇంత‌కీ దిల్‌రాజు కాంపౌండ్ హీరో ఇంత ట‌ఫ్ కాంపిటీష‌న్‌లో నెగ్గుకొస్తాడా? అన్న‌ది చూడాలి.

User Comments