రాజుగారికే కొర‌డా దెబ్బ‌లు

Last Updated on by

ఒక్కోసారి ఫ‌లితం ఊహాతీతంగా ఉంటుందిక్క‌డ‌. తానొక‌టి త‌లిస్తే విధి వేరొక‌టి త‌ల‌చింది! అన్న‌చందంగా ఉంటుంది. సినిమా ఇండ‌స్ట్రీలో ఈ త‌ర‌హా స‌న్నివేశాలెన్నో ఎన్నెన్నో. హిట్ట‌వుతుంది అనుకున్న సినిమా ఫ‌ట్ట‌వుతుంది. ఫ‌ట్ట‌వుతుంది అనుకున్న‌ది అనూహ్యంగా హిట్ కొట్టి షాకిస్తుంది. ఇప్పుడు నైజాం కింగ్ దిల్‌రాజు అనుభ‌వ పాఠ‌మిదే. అరుదైన‌ స‌న్నివేశ‌మిది. ఆయ‌న ఒక‌టి త‌లిస్తే, విధి ఇంకోటి త‌లిచింది. అలా నైజాం వ‌ర‌కూ 9కోట్ల‌కు కొనుక్కున్న `మెహ‌బూబా` అట్ట‌ర్‌ఫ్లాపై పెద్ద షాకిస్తే, తాను వ‌దులుకున్న `మ‌హాన‌టి` బంప‌ర్ హిట్ కొట్టి దిల్‌రాజుకు గుణ‌పాఠం నేర్పింది. రాజుగారికే ఈ రేంజులో కొర‌డా దెబ్బ‌లు త‌గిలాయ్‌! అంటే ఇంకెందరికో ఇలాంటి దెబ్బ‌లు ఎన్ని త‌గిలాయో అర్థం చేసుకోవ‌చ్చు.

`మెహ‌బూబా` ప్రీరిలీజ్ ప్రివ్యూ చూసి.. రాజుగారే అంత మాట‌న్నాక‌.. ఇంకేం హిట్ట‌వుతుందిలే అనుకున్నారు.. క‌ట్ చేస్తే..ఆ సినిమా డిజాస్ట‌ర్ అన్న టాక్ వ‌చ్చింది. పూరీ కొత్త‌గా ట్రై చేసినా, త‌న మార్క్ వ‌దిలేసినా ఈ సినిమాని ఎవ‌రూ ఆదుకోలేక‌పోయారు. `మెహ‌బూబా` బ్లాక్‌బ‌స్ట‌ర్ ఖాయం అని న‌మ్మి 9 కోట్లకు నైజాం కొనుక్కున్న దిల్‌రాజుకు ఇది మింగుడు ప‌డ‌ని రిజ‌ల్ట్‌. `మ‌హాన‌టి` చూసి ఇది క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట‌వ్వ‌ద‌ని వ‌దిలేసిన ఆయ‌న‌కు ఆ సినిమా అంతే షాక్‌ ట్రీట్‌ని ఇచ్చింది. అయ్యిందేదో అయ్యింది కానీ.. రాజుగారి రిలీజ్ క్యూలో వ‌రుస‌గా రాజుగాడు, హ‌లో గురు ప్రేమ‌కోస‌మే, శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రాలు ఉన్నాయి. క‌నీసం వీటి విష‌యంలో అయినా దిల్‌రాజు అంచ‌నా స‌ఫ‌ల‌మ‌వుతుందేమో చూడాలి.

User Comments