దిల్ రాజు -హ‌రీష్ శంక‌ర్ గొడ‌వ అదే

దిల్ రాజు-ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కు మ‌ధ్య చెడింద‌ని చాలాకాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఆ మ‌న‌స్ప‌ర్ధ‌ల‌కు కార‌ణం ఏంట‌న్న‌ది ఎక్క‌డా బ‌య‌ట‌కు రాలేదు. దిల్ రాజు బ్యాన‌ర్లో హ‌రీష్ శంక‌ర్ చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, దువ్వాడ జ‌గ‌న్నాథం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. అయితే దువ్వాడ జ‌గ‌న్నాథం మాత్రం హిట్టు అని ప్ర‌చారం చేసుకున్నారు. కానీ అందులో వాస్త‌వ‌మెంత‌న్న‌ది ఇప్ప‌టికీ మిస్ట‌రీనే. ఈ నేప‌థ్యంలో దిల్ రాజు- హరీష్ మ‌ధ్య మ‌నస్ప‌ర్ధ‌లు తారా స్థాయికి చేరిన‌ట్లు క‌థ‌నాలొచ్చాయి. తాజాగా హ‌రీష్ శంక‌ర్ ఓ ఇంటర్వూలో ఆ వివాదంపై స్పందించాడు.

మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవు. కేవ‌లం క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ మాత్ర‌మే. ఒక సినిమా న‌టున‌టుల ఎంపిక విష‌యంలో మాకు సింక్ అవ్వ‌లేదు. అంతకు మించి ఆయ‌న‌తో ఎలాంటి గొడ‌వ‌లు లేవు. వాల్మీకి ని వైజాగ్ లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇంత‌కీ మించి ప్రూఫ్ ఏం కావాలి అన్నారు. మ‌రి మ‌ళ్లీ దిల్ రాజు తో సినిమా చేస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా హ‌రీష్ నుంచి మాత్రం ఎలాంటి స‌మాధానం రాలేదు. ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రికైనా రుణ‌ప‌డి ఉన్నారా? అంటే ఠ‌కీమ‌ని ఎన్టీఆర్ పేరు చెప్పాడు. ఆయ‌న నాపై పెట్టిన న‌మ్మ‌కాన్ని( రామయ్యా వ‌స్తావ‌య్యా ప్లాప్ ) నిల‌బెట్టుకోలేక‌పోయాను. ఎప్ప‌టికైనా ఓ సినిమా చేసి ఆయ‌న‌కు మంచి విజ‌యాన్ని ఇవ్వాలి అని అన్నాడు.