హీరోని అవ‌మానించిన నిర్మాత‌?

Last Updated on by

యువ‌హీరో రాజ్ త‌రుణ్ తెలిసీ తెలియ‌క చేసిన కొన్ని త‌ప్పులు అత‌డి కెరీర్‌ని కొంత‌వ‌ర‌కూ వెన‌క‌డుగు వేసేలా చేశాయ‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడున్న న‌వ‌త‌రం హీరోల్లో సెల‌క్టివ్‌గా ఉండే హీరోగా రాజ్‌త‌రుణ్‌కి పేరుంది. స్క్రిప్టుల ఎంపిక‌లోనే అత‌డు ఎంతో తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తాడ‌న్న మంచి టాక్ ఉంది. అయితే ఏం జ‌రుగుతోందో కానీ, అత‌డు కొన్ని క‌మిట్‌మెంట్లు ఇవ్వ‌డం వ‌ల్ల‌నో ఏమో .. ఫ్లాపులొచ్చి కెరీర్ ప‌రంగా వీక‌య్యాడు. ఇక‌పోతే ఇండ‌స్ట్రీలో రాజ్ త‌రుణ్‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగించారు అత‌డంటే గిట్ట‌నివాళ్లు. యావ‌గేష‌న్స్ ఎక్కువైపోయాయ‌ని, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో లేడ‌ని, ఎఫైర్లు ఉన్న‌వాడ‌ని ర‌క‌ర‌కాలుగా ప్రచారం చేశారు. అప్ప‌ట్లో హెబ్బాతో అత‌డు చెట్టాప‌ట్టాల్ అంటూ తిరిగేస్తున్నాడ‌న్న ప్ర‌చారం సాగింది.

అదంతా అటుంచితే ల‌వ‌ర్ సినిమా రిలీజ్ ముంగిట అత‌డిని త‌న నిర్మాతే చిన్న‌బుచ్చ‌డం పెద్ద రేంజులో చ‌ర్చ‌కొచ్చింది. నిర్మాత దిల్‌రాజు … రాజ్ త‌రుణ్ గురించి మాట్లాడుతూ .. అత‌డు ఓ అప్‌క‌మ్ హీరో అని, వ‌రుస ఫ్లాప్‌ల‌తో హీరోగా వెన‌క‌బ‌డి వీక్‌గా ఉన్నాడ‌ని అన్నారు. ల‌వ‌ర్ రిజ‌ల్ట్ ఏంటో ముందే తెలిసిపోయిన వాడిగా ఫేసియ‌ల్ ఎక్స్‌ప్రెష‌న్స్ చూపించ‌డం మీడియా కంట ప‌డింది. ఇక‌పోతే ఈ సినిమాని దిల్‌రాజు అన్న కొడుకు హ‌ర్షిత్ నిర్మించాడు. 6కోట్లు పెట్టుబ‌డి అనుకుంటే మ‌రో 40 శాతం అద‌నంగా ఖ‌ర్చ‌యింద‌ని దిల్‌రాజు తెలిపారు. ఇక ల‌వ‌ర్ రిలీజైపోతోంది కాబ‌ట్టి బాక్సాఫీస్ వ‌ద్ద అంత పెద్ద మొత్తం తిరిగి వ‌స్తుందా? అన్నది ఆయ‌న ఫేస్‌లో ఓ క్వ‌శ్చ‌న్‌. మొత్తానికి రాజ్ త‌రుణ్‌తో దిల్‌రాజు స‌ఖ్య‌త ఎంత? అన్న సందేహాల్ని రాజేసింది ఆ త‌రుణం. చూద్దాం కెరీర్‌ని గెలిపించుకునే స‌త్తా ఉన్న హీరో రాజ్ త‌రుణ్‌. అత‌డు మాస్ మ‌హారాజా ర‌వితేజ అంతటోడు. ఈ సంధికాలం నుంచి అత‌డు ధీరుడిలా బ‌య‌ట‌ప‌డ‌తాడ‌నే ఆశిద్దాం. సినిమాలో కంటెంట్, రాజ్‌త‌రుణ్‌లో ఎన‌ర్జీ ఇన్ని ప్ర‌తికూల‌త‌ల మ‌ధ్య ల‌వ‌ర్ చిత్రాన్ని గెలిపిస్తాయ‌నే భావిద్దాం.

User Comments