అమ్మ‌కానికి రాక్ష‌స‌బ‌ల్లి

Last Updated on by

ఆన్‌లైన్‌లో అన్నీ అమ్మేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో బాహుబ‌లి టాయ్స్ అమ్మేశారు. ఇప్పుడు డైనోసార్ల‌ను అమ్మేస్తున్నారు. కొనుక్కున్న‌వాడికి కొనుక్కున్నంత బిల్లు. అయితే సినిమాల‌తో క్రేజు తెచ్చుకున్న కొన్ని వ‌స్తువుల్ని ఆన్‌లైన్‌లో ప్రీసేల్ రూపంలోనే రికార్డులు సృష్టించ‌డం అన్న‌ది హాలీవుడ్‌లో అనాదిగా సాగుతున్న ట్రెండ్‌. అప్ప‌ట్లో స్పైడ‌ర్‌మేన్ మాస్క్‌లు అంత‌ర్జాలంలో అమ్మ‌కానికి పెట్టారు. అభిమానులు క్రేజీగా మాస్క్‌లు కొనుక్కున్నారు.

తాజాగా రాక్ష‌స బ‌ల్లిని కూడా ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. `క్రానిక‌ల్ క‌లెక్టిబుల్స్` సంస్థ‌ డైనోసార్ ఫ‌ర్ సేల్ అంటూ ప్ర‌క‌టించింది. అయితే ఇది ఎంత పెద్ద‌ సైజులో ఉంటుందో.. అని కంగారు ప‌డ‌కండి. ఇది చాలా చిన్న సైజ్ డైనోసార్‌. ఇంకా చెప్పాలంటే పిల్ల డైనోసార్‌. దీని పేరు `బేబి బ్లూ`. `జురాసిక్ వ‌ర‌ల్డ్‌-ఫాలెన్ కింగ్‌డ‌మ్‌`లో ఓ పాత్ర‌ధారి ఇది. దీనిని కావాల‌నుకుంటే.. ఆన్‌లైన్‌లో ప్రీఆర్డ‌ర్ చేయొచ్చు. వ‌ర‌ల్డ్‌వైడ్‌ జురాసిక్ పార్క్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మ‌కాలు సాగిస్తున్నారు. ఆర్డ‌ర్ ఇస్తే చాలు.. బేబి బ్లూ .. మీ ఇంటికొస్తుంది.. తొడ‌కొడుతుంది.. ఎదుర్కొనే ద‌మ్ము అటుపై మీకుండాలి. ఇంత‌కీ ఇది ఎలా త‌యారైంది? అంటే .. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు స్క‌ల్ప్చ‌ర్‌లో బొమ్మ‌లు తయారు చేస్తారు క‌దా.. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్‌తో జీవం పోస్తుంటారు. ఇది కూడా ఆ త‌ర‌హానే. కాక‌పోతే దీనికోసం కింద ప‌డినా ఠ‌పీమ‌ని విరిగిపోనంత బ‌ల‌మైన ప్ర‌దార్థాన్ని ఉప‌యోగించి త‌యారు చేస్తారంతే.

User Comments