గోదారిలో డైరెక్ట‌ర్- కెమెరామేన్ మున‌క‌

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పిచుకులంక సమీపాన గోదావరిలో స్నానం చేస్తుండగా ఉభలోకి దిగి షార్ట్ ఫిలిం డైరెక్టర్ కెమెరామెన్ లు ఇద్దరు మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

మృతులు హైదరాబాద్ కి చెందిన కార్తీక్ (35), రాజమండ్రికి చెందిన సుధీర్ (33) గా గుర్తించారు.  షార్ట్ ఫిలిం డైరెక్టర్ సుదీర్,కెమెరామెన్ కార్తిక్ లు కలిసి షార్ట్ ఫిలిం కోసం లొకేషన్ చూడకు వచ్చి స్నానానికి దిగగా ప్రమాదం జ‌రిగింద‌ని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లు సహాయంతో  మృతదేహాలు వెలికి తాశారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది.