న‌ట‌వార‌సుడి కోసం ద‌ర్శ‌కుడి త్యాగం

Last Updated on by

కొత్త త‌ర‌హా చిత్రాల ఒర‌వ‌డిలో ఓ గేమ్ ఛేంజ‌ర్‌గా వ‌చ్చిన ఈ సినిమా `అర్జున్‌రెడ్డి`. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త మార్పుల‌కు నాందిగా నిలిచిన ఈ సినిమా ప‌క్క రాష్ట్రం త‌మిళ‌నాడులో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని త‌మిళంలో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్‌తో రీమేక్ చేశారు. బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే తొలి కాపీ చూసుకున్న చిత్ర బృందం షాక్‌కు గురైంద‌ట‌. అనుకున్న సినిమా ఏంటీ? బాల తీసిన సినిమా ఏంట‌ని కంగుతున్న చిత్ర బృందం ఈ సినిమాని ప‌క్క‌న పెట్టి మ‌ళ్లీ ఫ్రెష్‌గా రీమేక్ చేయాల‌ని, దానికి మ‌రో ద‌ర్శ‌కుడిని అనుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇదే ప్ర‌స్తుతం వివాదంగా మారింది.

బాల‌ను త‌ప్పించ‌డం, సినిమాని ప‌క్క‌న పెట్ట‌డం ఆయ‌న‌ను అవ‌మానించ‌డ‌మే అంటూ ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే వివాదం ముదురుతుండ‌టంతో బాల ఎట్ట‌కేల‌కు నోరు విప్పారు. ఈ ప్రాజెక్ట్ నుంచి త‌న‌ని ఎవ‌రూ త‌ప్పించ‌లేద‌ని, స్వ‌చ్ఛందంగానే త‌ప్పుకున్నాన‌ని, క్రియేటీవ్ ఫ్రీడ‌మ్ కోస‌మే ఇలా చేయాల్సి వ‌చ్చింద‌ని, ఈ వివాదం వల్ల ధృవ్ కెరీర్ డిస్ట్ర‌బ్ కాకూడ‌ద‌న్న ఆలోచ‌న వ‌ల్లే ఇంత‌కు మించి మాట్లాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తేల్చిచెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ధృవ్ కెరీర్ గురించి ఎవ‌రూ దీన్ని వివాదం చేయొద్ద‌ని బాల త‌ను విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో మ‌రీ మ‌రీ చెప్ప‌డం త‌మిళ సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

User Comments