రౌడీకే స్కెచ్ వేసిన బాబి

రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజు స్కైని ట‌చ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డియ‌ర్ కామ్రేడ్ ఫెయిలైనా అత‌డు న‌టించిన అర్జున్ రెడ్డి..గీత గోవిందం ఓ రేంజులో మైలేజ్ నిచ్చాయి. ఇప్పుడు పూరితో ఫైట‌ర్ చిత్రం చేస్తున్నాడు. దీనిని ఇటు తెలుగు అటు హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో రిలీజ్ చేసేలా బ‌హుభాషా చిత్రంగా తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి అన్ని ప‌నులు ముగించి విజ‌య్ పూర్తిగా  ఫైట‌ర్ పైనే దృష్టి సారిస్తున్నాడ‌ట‌.

వ‌రుస‌గా సినిమాల‌కు ప్లాన్ చేస్తున్న రౌడీ దృష్టి ఇప్పుడు పెద్ద లెవ‌ల్లోనే ఉంది. అయితే అత‌డికి మాస్ ఇమేజ్ తెచ్చే సినిమా చేస్తాన‌ని అంటున్నాడు డైరెక్ట‌ర్ బాబి. విజ‌య్‌లోని మాస్ ఎన‌ర్జీకి త‌గ్గ స్క్రిప్టు త‌న‌వ‌ద్ద ఉంద‌ని అయితే దానికి ఇంకా తుది మెరుగులు దిద్దాల్సి ఉంటుంద‌ని ఓ ఇంట‌ర్వ్యూలో అన‌డం హాట్ టాపిక్ గా మారింది. ఈ శుక్ర‌వారం బాబి తెర‌కెక్కించిన వెంకీమామ రిలీజ‌వుతోంది. తదుప‌రి రౌడీకే అత‌డు స్కెచ్ వేయ‌డం ఇంట్రెస్టింగ్.