డైరెక్టర్ హరీష్ శంకర్ హైటెక్ బెగ్గింగ్

Last Updated on by

ఆల్రెడీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దేళ్లైపోయింది.. ఓ ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చాడు.. రెండు మూడు విజ‌యాలు ఇచ్చారు.. ఆయ‌న‌కంటూ ఓ క్రేజ్ ఉంది.. గ‌తేడాది కూడా 70 కోట్ల సినిమా ఇచ్చాడు. అయినా కూడా ఇప్ప‌టికీ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నాడు. ఆ ద‌ర్శ‌కుడే హ‌రీష్ శంక‌ర్. ఈయ‌న ఇప్ప‌టికే అర‌డ‌జ‌న్ సినిమాలు చేసాడు.. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి హిట్స్ ఇచ్చాడు. అయినా కూడా ఇప్పుడు ఆఫ‌ర్ల కోసం అడుగుతున్నాడు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ త‌న‌కు ఓ అవ‌కాశం ఇవ్వండి అంటూ అడుగుతుండ‌టం ఆయ‌న్ని అభిమానించే వాళ్ల‌కు కూడా షాకిస్తుంది. మొన్న‌టికి మొన్న తేజ్ ఐ ల‌వ్ యూ వేడుక‌లో కేఎస్ రామారావు గారికి హ‌రీష్ శంక‌ర్ అనే ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌నే సంగ‌తి గుర్తు పెట్టుకోండంటూ ఓపెన్ గానే ఆఫ‌ర్ అడిగాడు. ఇక చిరంజీవిని ఎప్ప‌ట్నుంచో అడుగుతూనే ఉన్నాడు.

స‌మ్మోహ‌నం ప్రీ రిలీజ్ లో కూడా నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ను ఐదేళ్లుగా త‌నతో సినిమా చేస్తానంటున్నాడు.. ఇంకా చేయ‌డం లేదు అంటూ గుర్తు చేసాడు. హీరో సుధీర్ బాబు నిర్మాత‌గా మారాడు క‌దా.. ఆయ‌న్ని కూడా ముందే అడ్వాన్స్ ఇస్తారు బాబాయ్ ద‌ర్శ‌కుల‌కు గుర్తు పెట్టుకో అంటూ అడ‌క్కుండానే ఆఫ‌ర్ అడిగేసాడు. మ‌హేష్ బాబును సైతం మీరు ప్ర‌తీ ద‌ర్శ‌కుడి క‌థ‌లోకి ఇట్టే దూరిపోతారు.. అలాగే నా క‌థ‌లోకి కూడా దూరిపోవాల‌ని కోరుకుంటున్నాను అంటూ అక్క‌డా అడిగేసాడు. ఇలా ఏ వేడుక‌కు వ‌చ్చినా కూడా అక్క‌డున్న హీరోలు.. నిర్మాత‌ల‌ను హ‌రీష్ ఇలా అడ‌గడం ఆయ‌న్ని అభిమానించే వాళ్ల‌కు కూడా ఇబ్బందిగా ఉంది. మ‌రి ఇది ఆయ‌న వ‌ర‌కు వెళ్తుందో లేదో..?

User Comments