డైరెక్టర్ కే అర్ధం కానీ దాగుడు మూత‌లు

కొన్నిసార్లు అంతే.. వ‌ర‌స సినిమాలు చేతిలో క‌నిపిస్తుంటాయి. కానీ అవి సెట్స్ పైకి వెళ్ల‌వు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఈయ‌న రెండు సినిమాలు అనౌన్స్ చేసాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా ప‌ట్టాలెక్క‌లేదు. డిజే వ‌చ్చి 10 నెలలు కావొస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు హ‌రీష్. దాగుడు మూతలు సినిమా చేస్తానంటూ డిజే విడుద‌ల‌కు ముందే ప్ర‌క‌టించాడు ఈ ద‌ర్శ‌కుడు. అది కూడా దిల్ రాజు బ్యాన‌ర్ లోనే. దానికోసం అమెరికా వెళ్లి లొకేష‌న్స్ కూడా చూసుకుని వ‌చ్చాడు. నితిన్, శ‌ర్వానంద్ అంటూ హీరోల‌ను కూడా అనౌన్స్ చేసాడు. కానీ వాళ్లిప్పుడు ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉన్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళ‌తో దాగుడు మూత‌లు ఆడించ‌డం చాలా కష్టం.
దాంతో ఈ సినిమాను ప‌క్క‌న‌బెట్టి ఇప్పుడు మ‌రో సినిమా అనౌన్స్ చేసాడు హ‌రీష్ శంక‌ర్. అదే సీటీమార్.

సీటీమార్ సినిమాను జ‌వాన్ ఫేమ్ అరుణాచ‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ర‌వితేజ ఇందులో హీరోగా న‌టిస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. హ‌రీష్ కు లైఫ్ ఇచ్చింది మాస్ రాజానే. షాక్ తో షాక్ ఇచ్చినా కూడా న‌మ్మి మిర‌ప‌కాయ్ ఇచ్చాడు. అది హిట్ అయింది. ఆ త‌ర్వాతే గ‌బ్బ‌ర్ సింగ్ తో మ‌నోడు స్టార్ డైరెక్ట‌ర్ అయ్యాడు. కానీ ఆ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లా ఆ రేంజ్ సినిమా చేయ‌లేదు హ‌రీష్ శంక‌ర్. ప్ర‌స్తుతం అదే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. మ‌రి ఇప్ప‌టికైనా ఈ ద‌ర్శ‌కుడి క‌ల నెర‌వేరుతుందా..? సీటీమార్ కంటే ముందు దాగుడుమూత‌లు వ‌స్తుందా.. లేదంటే ఆ సినిమాను పూర్తిగా ప‌క్క‌న‌బెట్టి సీటీమార్ అంటూ ర‌వితేజ‌తో వెళ్లిపోతాడా…? ఇవ‌న్నీ ప్ర‌స్తుతానికి స‌మాధానం లేని ప్ర‌శ్న‌లే.