పాపం వాళ్లకు బాలయ్యే టార్గెట్ అవుతున్నాడు

 

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న విషయం అందరికీ తెలుసు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బాలయ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

ఓ టైమ్ లో సీనియర్ హీరోగా బాలయ్య కెరీర్ కు ఇంక ఫుల్ స్టాప్ పడినట్లే అనుకునే పరిస్థితి నుంచి.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇచ్చే పరిస్థితికి బాలయ్య వచ్చారంటే అది ఆయన గొప్పతనమే అనాలి.

అయితే, బాలయ్య మంచితనాన్నే ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ క్యాష్ చేసుకోవాలని చూస్తుండటం మాత్రం విడ్డూరమే అనాలి.

అసలు విషయంలోకి వెళితే, బాలయ్య తన హార్డ్ వర్క్, క్రమ శిక్షణ, నిబద్ధతతో వరుసగా సినిమాలు కమిట్ అవుతూ మన దర్శకుల మీద నమ్మకంతో ఓకే చెబుతుంటే..

అదే అదునుగా ఫ్లాప్ డైరెక్టర్స్ ఆయన వెంటపడుతుండటం గమనార్హం.

ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్ కు తన 101వ సినిమాను బాలయ్య ఇస్తే.. ‘పైసా వసూల్’ అంటూ పూరీ మళ్ళీ ఓ ఫ్లాప్ సినిమానే తీసి మంచి ఛాన్స్ ను వేస్ట్ చేశాడు.

ఇక ఇప్పుడు బాలయ్య తన 102వ సినిమాను కూడా ఫ్లాపుల్లో ఉన్న బడా డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తో చేస్తున్నారు.

ఆయన సీనియారిటీ, టాలెంట్ ను నమ్మి బాలయ్య ఛాన్స్ ఇస్తే.. ఆయన ఏం చేస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే, ఇప్పుడు బాలయ్య తన 103వ సినిమాను కూడా పూరీ చేతిలోనే పెట్టేలా కనిపిస్తున్నారు. అలాగే ఫ్లాపుల్లో ఉన్న కృష్ణవంశీ కూడా ఇప్పుడు ఆశగా బాలయ్య వైపే చూస్తున్నారు.

ఇదంతా ఇప్పటికే కొంచెం తెలిసిన విషయమే అయినా.. ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ లాంటి యావరేజ్ డైరెక్టర్ కూడా బాలయ్యనే టార్గెట్ చేశాడని తెలియడం విశేషమే అనాలి.

ఇటీవలే స్టైలిష్ స్టార్ తో డీజే అంటూ మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టిన సినిమాను హరీష్ శంకర్ తీసినా..

అదంతా బన్నీ టాలెంట్ అని, దర్శకుడిగా హరీష్ టోటల్ గా ఫెయిల్ అయ్యాడని విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీంతో యంగ్ హీరోలు కూడా ఇప్పుడు హరీష్ కు ముఖం చాటేస్తున్నారని తెలుస్తోంది.

అందుకే ఇప్పుడు బాలయ్యకే హరీష్ శంకర్ కథ చెబుతున్నాడని టాక్ వినిపిస్తుండటం హాట్ టాపిక్ అనే అనాలి. దీంతో తన మంచితనంతో బాలయ్య ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్స్ కు టార్గెట్ అయిపోతున్నాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరి సదరు డైరెక్టర్స్ దొరికిన మంచి ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే పర్లేదు..

కానీ మళ్ళీ ఫెయిల్ అయితే మాత్రం పరిశ్రమ మంచి కోరే బాలయ్య లాంటి హీరోలకు కూడా అది ఇబ్బందే అవుతుంది.

Follow US