స‌మ్మోహ‌నంలో ఓ హీరో పై సెటైర్లు

Last Updated on by

ఇంద్రగంటి మోహ‌న‌కృష్ణ‌.. ఈయ‌న పేరులోనే ఎంతో సాఫ్ట్ నేచ‌ర్ ఉంది. ఈయ‌న్ని చూస్తే క‌నీసం ప‌న్నెత్తి మాట‌.. క‌న్నెత్తి కోపంగా చూపు కూడా చూడ‌లేం. ఎందుకంటే ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ అలాంటిది మ‌రి. కానీ శాంతంగా ఉండే వాళ్ల‌కు కోపం వ‌స్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో స‌మ్మోహ‌నం చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇండ‌స్ట్రీలోనే ఉంటూ.. ఇండ‌స్ట్రీపైనే అదిరిపోయే పంచ్ లు వేసాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి. ముఖ్యంగా ఒక సీన్ లో అయితే వార‌సుల‌పై అదిరిపోయే పంచ్ వేసాడు ఈ ద‌ర్శ‌కుడు.

కిషోర్ బాబు అనే ఓ హీరో ఉంటాడు సినిమాలో.. అత‌డి గురించి అడుగుతున్న‌పుడు అందులో ఆ సినిమాకు ప‌ని చేసే వాడే అంటాడు.. ఐదేళ్లుగా ప్రేక్ష‌కుల‌కు అల‌వాటు చేయ‌డానికి చూస్తున్నారు క‌దా.. అత‌డేనా కిషోర్ బాబు అంటే అని. అంటే ఈ ఒక్క మాట‌లో ఎంత సెటైర్ ఉందో అర్థం చేసుకుంటే స‌రిపోతుంది. కావాల‌నే ప్రేక్ష‌కులపై కొంద‌రు హీరోల‌ను రుద్దేస్తున్నార‌ని చెప్ప‌క‌నే చెప్పాడు ఇంద్ర‌గంటి. ఈ డైలాగ్ ఏ ఒక్క‌ర్నో ఉద్దేశ్యించి ఇంద్ర‌గంటి పెట్ట‌క‌పోయినా.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ కు మాత్రం నేరుగానే త‌గిలేసిందంటున్నారు విశ్లేష‌కులు.

ఎందుకంటే కొన్నేళ్లుగా భారీ బ‌డ్జెట్ తో సినిమాలు చేస్తూ.. ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది ఈ ఒక్క హీరోనే..! దాంతో నేరుగా అత‌డికే తగిలింది. ఇలాంటి సెటైర్లు ఇంకా చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. క్యాస్టింగ్ కౌచ్ ను కూడా బాగానే టార్గెట్ చేసాడు ఇంద్ర‌గంటి. దాంతోపాటు ఇండ‌స్ట్రీలోని మంచిని కూడా చూపించాడు. స‌మ్మోహ‌నం ఈ మధ్య కాలంలో తెలుగులో వ‌చ్చిన ది బెస్ట్ మూవీస్ లో ఒక‌టిగా నిల‌వ‌డం ఖాయమైపోయింది. ఇక ఇప్పుడు దీని కమ‌ర్షియ‌ల్ రేంజ్ ఏంట‌నేది తెలియాల్సి ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితులు చూస్తుంటే ఒక్క వారంలోనే సినిమా సేఫ్ కావ‌డ‌మే కాదు.. లాభాల్లోకి కూడా తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది.

User Comments