ద‌ర్శ‌కేంద్రుడికి అవ‌మానం

Last Updated on by

ఎన్నిక‌ల వేళ చిత్ర‌విచిత్రాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. మ‌న స్టార్లంతా ఓట్లు వేస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్ అగ్ర‌హీరోలంతా ఓటు క్యూలో నిల‌బ‌డి ఓట్లు వేసారు. అందులో మెగాస్టార్ ఫ్యామిలీ ఉంది. ఇక‌పోతే ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాత్రం ఓటు వేయ‌కుండా వెళ్లిపోవ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. అస‌లింత‌కీ ఏమైంది? అంటే..

నేడు ఆయ‌న ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ క‌ల్చ‌ర్ సెంట‌ర్ (ఎఫ్ఎన్‌సీసీ)లోని ఓ పోలింగ్ బూత్‌కి వెళ్లార‌ట‌. అయితే అప్ప‌టికే అక్క‌డ ర‌ద్దీగా ఉండ‌డంతో క్యూలో నిల‌బ‌డ‌లేక .. నేరుగా లోనికి వెళ్ల‌బోయార‌ట‌. దాంతో క్యూలో నించున్న ఒక ఓట‌రు ఆయ‌న్ని పిలిచి మాకేం ప‌ని లేదా.. క్యూలో నిల‌బ‌డి ఓటేయండి! అంటూ నిల‌దీశాడ‌ట‌. దాంతో సీరియ‌స్ అయిన కె.రాఘ‌వేంద్ర‌రావు దానిని అవ‌మానంగా భావించి రుస‌రుస‌లాడుతూ అక్క‌డినుంచి వెళ్లిపోయార‌ట‌. గ‌త ఏడాది సేమ్ స‌న్నివేశం మెగాస్టార్ చిరంజీవికి ఎదురైనా, ఆయ‌న ఎంతో ఓర్పుగా, స‌హ‌నంతో క్యూలో నించుని మ‌రీ ఓటేశారు. అజిత్ లాంటి స్టార్ హీరోలు ఒక సామాన్యుడిలా క్యూలో నించుని ఓటేస్తుంటారు. కానీ రాఘ‌వేంద్రుడు మాత్రం దీనిని ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుని ఓటేయ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

User Comments