చిరంజీవితో కొర‌టాలకు ప‌నేంటి..?

Last Updated on by

Last updated on May 11th, 2018 at 08:41 am

మంచి క‌థ దొరికితే ఎవ‌రితో సినిమా చేయ‌డానికైనా తాను సిద్ధ‌మే అని ఆ మ‌ధ్య చిరంజీవి అనౌన్స్ చేసాడు. కుర్ర ద‌ర్శ‌కుల‌కు కూడా ఇది మంచి ఆఫ‌రే. ఓ వైపు త‌మిళ‌నాట ర‌జినీకాంత్ ఇదే చేస్తున్నాడు. ఓ వైపు శంక‌ర్ లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తో పాటు మ‌రోవైపు రంజిత్, కార్తిక్ సుబ్బ‌రాజ్ లాంటి కుర్రాళ్ళ‌తో కూడా ప‌ని చేస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఇదే చేయాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న సురేంద‌ర్ రెడ్డితో సైరాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి శీనుతో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు. ఇక ఇప్పుడు ఈయ‌న్ని కొర‌టాల శివ క‌ల‌వ‌డం అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

అస‌లే సామాజిక క‌థ‌లకు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ద్ది చెప్ప‌డంలో కొర‌టాల అందె వేసిన చేయి. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన నాలుగు సినిమాల్లోనూ ఇదే చేసాడు కొర‌టాల‌. ఈ నాలుగు కూడా బాక్సాఫీస్ ను కుమ్మేసాయి. ఇక ఇప్పుడు ఈయ‌న అఖిల్ కోసం ఓ క‌థ సిద్ధం చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. ఈ గ్యాప్ లోనే చిరంజీవిని క‌లిసాడు కొర‌టాల శివ‌. త‌న ద‌గ్గ‌ర ఉన్న ఓ క‌థ‌ను చెప్పాడ‌ని తెలుస్తుంది. ఇది కూడా పూర్తిగా సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థే అని తెలుస్తుంది. కొర‌టాల టేకింగ్ గురించి ఇప్ప‌టికే ఓ ఐడియా ఉన్న చిరు కూడా సినిమా చేద్ధామ‌నే మాట ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ కాంబినేష‌న్ వ‌ర్క‌వుట్ అయితే కానీ ఠాగూర్ రేంజ్ లో క‌మ‌ర్షియ‌ల్ ప్ల‌స్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వ‌స్తుందేమో..? ఏమో చూడాలి.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

User Comments